Big Bash League : టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పాకిస్తాన్ ఆటగాళ్లు.. కారణమేంటంటే..

ప్రస్తుతం ఆస్ట్రేలియా  వేదికగా బిగ్ బాష్ లీగ్ రసవత్తరంగా జరుగుతోంది. ఈ టోర్నీలో  పలు దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. పాకిస్తాన్ కు చెందిన పలువురు క్రికెటర్లు

Big Bash League : టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పాకిస్తాన్ ఆటగాళ్లు..  కారణమేంటంటే..

Edited By:

Updated on: Jan 17, 2022 | 6:46 AM

ప్రస్తుతం ఆస్ట్రేలియా  వేదికగా బిగ్ బాష్ లీగ్ రసవత్తరంగా జరుగుతోంది. ఈ టోర్నీలో  పలు దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. పాకిస్తాన్ కు చెందిన పలువురు క్రికెటర్లు కూడా   ఇందులో ఆడుతున్నారు.  అయితే ఇప్పుడు ఈ ఆటగాళ్లందరూ తమ దేశానికి తిరిగి పయనం కానున్నారు. ఈ మేరకు బీబీఎల్‌లో పాల్గొంటున్న తమ జాతీయ ఆటగాళ్లందరూ వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని పాకిస్థాన్  క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందిదీనికి కారణం  పాకిస్తాన్ సూపర్ లీగ్.   జనవరి 27 నుంచి పీఎస్‌ఎల్‌ టోర్నీ ప్రారంభం కానుంది.  ఈ మేరకు టోర్నీకి అన్ని రకాలుగా సన్నద్ధమయ్యేందుకు గానూ తమ ఆటగాళ్లకు వెంటనే స్వదేశానికి రావాలని పీసీబీ కోరింది.

ఇందులో భాగంగా బీబీఎల్ లో ఆడుతున్న  మహ్మద్ హస్నైన్, ఫకర్ జమాన్, హరీస్ రవూఫ్,  షాదాబ్ ఖాన్‌లు ఆసీస్ నుంచి నేరుగా  పాకిస్తాన్ ఫ్లైట్ ఎక్కనున్నారు.  షెడ్యూల్ ప్రకారం కరాచీ, లాహోర్‌లలో రెండు దశల్లో  పీఎస్ ఎల్ నిర్వహించనున్నట్లు పీసీబీ ధ్రువీకరించింది.   కాగా ఈ టోర్నీ కోసం  మెల్‌బోర్న్ స్టార్స్ నుంచి తప్పుకుంటున్నట్లు  రౌఫ్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపాడు. ‘    బీబీఎల్ లో  మెల్‌బోర్న్ స్టార్స్‌తో నా అద్భుతమైన  ప్రయాణం ముగిసింది. నేను ఇక్కడ కొన్ని గొప్ప మ్యాచ్ లను ఆడాను. ఆస్వాదించాను. ఎంతో అనుభవం కూడా సంపాదించాను.  బీబీఎల్ టోర్నీలో ఆడడం నా అదృష్టం. మెల్ బోర్న్ స్టార్స్ కి  ఆల్ ద బెస్ట్ ‘ అని అందులో రాసుకొచ్చాడు.

కాగా పీసీబీ నిర్ణయం కారణంగా  బ్రిస్బేన్ హీట్ జట్టు  స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ సేవలను కోల్పోనుంది. దీనిపై ఆ జట్టు నిరాశ వ్యక్తం చేసింది.   కాగా గత ఏడాది డిసెంబర్ 31న ఫఖర్ ఈ ఫ్రాంఛైజీలో చేరాడు.  కానీ కోవిడ్ -19 కారణంగా ట్రాఫిక్ ఆంక్షల కారణంగా, అతను కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు.

Also Read: బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన భామలు వీరే..

Megha Akash: అందాల సోయగం.. నవ్వుల నయాగారం మేఘా ఆకాష్ సొగసులు చూడతరమా.!

krithi shetty: కంటి చూపుతో కట్టి పడేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్