
Pakistan vs Kuwait: హాంగ్ కాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ మొదటి రోజే క్రికెట్ అభిమానులకు కళ్లు చెదిరే విందు లభించింది. పాకిస్థాన్-కువైట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 36 బంతుల్లో (6 ఓవర్లు) 124 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సంచలన ఛేజింగ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది కేవలం 12 బంతుల్లోనే 55 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన కువైట్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. హాంకాంగ్ సిక్సెస్ ఫార్మాట్‌లో ఇది చాలా భారీ స్కోరు. ఈ టార్గెట్ చూసి పాకిస్థాన్ గెలుపు కష్టమేనని అంతా భావించారు.
అయితే, ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్ కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది బౌండరీల సునామీ సృష్టించాడు. కువైట్ బౌలర్లపై అత్యంత విధ్వంసకరంగా విరుచుకుపడి కేవలం 12 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏకంగా 8 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 458గా ఉంది.! ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కూడా బాదడం గమనార్హం.
హాంకాంగ్ సిక్సెస్ నియమాల ప్రకారం, ఒక బ్యాటర్ 50 పరుగులు చేయగానే రిటైర్డ్ హర్ట్ (నాటౌట్)గా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అబ్బాస్ అఫ్రిది 55 పరుగుల వద్ద క్రీజు వీడగా, పాకిస్థాన్‌కు మ్యాచ్ గెలవడం మళ్ళీ సవాలుగా మారింది.
చివరి ఓవర్‌లో పాకిస్థాన్‌కు 29 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన షాహిద్ అజీజ్ 5 బంతుల్లోనే అద్భుతమైన 23 పరుగులు (3 సిక్సర్లు, 1 ఫోర్) చేసి చివరి బంతికి పాకిస్థాన్‌ను ఉత్కంఠభరితమైన విజయతీరాలకు చేర్చాడు.
కువైట్ బౌలర్ యాసిన్ పటేల్ 2 ఓవర్లలో 55 పరుగులు, అదిల్ ఇద్రీస్ చివరి ఓవర్‌లో 29 పరుగులు ఇవ్వడం పాకిస్థాన్ గెలుపుకు దోహదపడింది. ఈ సంచలన విజయం అబ్బాస్ అఫ్రిది ఆటతీరుకు, పాకిస్థాన్ జట్టు పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.
Abbas Afridi brilliant 55 Runs in just 12 balls#HongKongSixespic.twitter.com/muYmwvL6Ld
— Arxy 🇦🇪 (@ArxySays) November 7, 2025
నవంబర్ 7న జరిగే హాంకాంగ్ సిక్సర్స్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. భారత జట్టుకు దినేష్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కార్తీక్‌లో రాబిన్ ఉతప్ప, స్టూవర్ట్ బిన్నీ, భరత్ చిప్లి, అభిమన్యు మిథున్, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పంచల్ కూడా ఉన్నారు.
నవంబర్ 7, భారత్ vs పాకిస్థాన్ (1:05pm IST)
నవంబర్ 8: భారత్ vs కువైట్ (ఉదయం 6:40 IST)
నవంబర్ 8 – క్వార్టర్ ఫైనల్స్ (మధ్యాహ్నం 2గం IST)
నవంబర్ 9 – సెమీ-ఫైనల్ 1 & 2 (ఉదయం 9:25 & ఉదయం 10:20 IST)
నవంబర్ 9 – ఫైనల్ (IST ఉదయం 2 గంటలకు)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..