లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్.. ఆ యువతి గురించి ఏం చెప్పాడో తెలిస్తే షాక్..

Pakistan Captain Babar Azam : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 2 నుంచి పాకిస్తాన్.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్.. ఆ యువతి గురించి ఏం చెప్పాడో తెలిస్తే షాక్..
Pakistan Captain Babar Azam

Updated on: Mar 20, 2021 | 6:42 PM

Pakistan Captain Babar Azam : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 2 నుంచి పాకిస్తాన్.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. త్వరలోనే జట్టు దక్షిణాఫ్రికాకు పయనంకానుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో బాబర్ అజామ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాల్సిందిగా లాహోర్ కోర్టు తాజాగా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా బాబర్ షాక్‌కి గురయ్యాడు.

అయితే గతంలో బాబర్ అజామ్‌ తనన పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, అంతేకాకుండా అబార్షన్‌ చేసుకోమ్మని ఒత్తిడికి గురిచేశాడని ఓ యువతి మీడియా ఎదుట ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. యువతి ఆరోపణల్ని బాబర్ అజామ్ కొట్టిపారేశాడు. డబ్బు కోసం యువతి అలా బ్లాక్‌మెయిల్ చేస్తోందని విమర్శించాడు. తాజాగా ఆమె లాహోర్ కోర్టుని ఆశ్రయించడంతో.. బాబర్ అజామ్‌పై కేసు నమోదైంది.

దీనిపై స్పందించిన బాబర్ అజామ్.. ఇది తన పర్సనల్‌ సమస్య అని ప్రస్తుతం కోర్టులో విచారణ నడుస్తోందని పేర్కొన్నాడు. అంతేకాకుండా తన లాయర్ ఆ పనిమీదే ఉన్నడని చెప్పాడు. జీవితంలో ఇటువంటి విషయాలు సహజమేనని.. ఈ సమస్యల వల్ల తన క్రికెట్ కెరియర్‌కు వచ్చిన సమస్యలు ఏం లేవని కొట్టిపారేశాడు. ఏది ఏమైనా కోర్టు కేసు నమోదు చేయమని ఆదేశాలు రావడంతో బాబర్ దక్షణాఫ్రికా టూర్‌పై నీలి నీడలు కమ్ముకున్నట్లే.

Telangana MLC Election Results 2021 LIVE: హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి ఘన విజయం..

జూన్ 1 తర్వాత ఇది లేకుండా బంగారం అమ్మరాదు.. కొనరాదు.. ఎందుకో తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..

Shocking Video: దాహం తీర్చుకుంటున్న జింక.. కన్నేసిన మొసలి.. కట్ చేస్తే అదిరిపోయే ట్విస్ట్.!

మార్చి 31 లోపు ఈ పనులను పూర్తిచేసుకోండి.. లేదంటే వడ్డీలు, ఫైన్లతో నానా ఇబ్బందులు.. తెలుసుకోండి