ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని దాటేసిన పాకిస్తానీ ఆటగాడు.. ఎవరంటే..?

|

Apr 14, 2021 | 5:30 PM

Latest ICC rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం దూసుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.  గత మూడేళ్ల నుంచి వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​లో ఉన్న విరాట్​ను వెనక్కు నెట్టి..

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని దాటేసిన పాకిస్తానీ ఆటగాడు.. ఎవరంటే..?
Icc Rankings Babar Azam Top
Follow us on

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం దూసుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.  గత మూడేళ్ల నుంచి వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​లో ఉన్న విరాట్​ను వెనక్కు నెట్టి, ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేలో 94 పరుగులు చేసిన బాబర్.. 13 రేటింగ్ పాయింట్లు సాధించి టాప్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం బాబర్ 865, కోహ్లీ 857 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

తరఫున వన్డేల్లో టాప్ ర్యాంక్ అందుకున్న నాలుగో బ్యాట్స్​మన్ బాబర్. ఇతడి కంటే ముందు జహీర్ అబ్బాస్, జావేది మియాందాద్, మహమ్మద్ యూసఫ్ ఈ ఘనత సాధించారు. బ్యాట్స్​మెన్​లో టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ మూడో స్థానంలో, బౌలర్లలో బుమ్రా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్​రౌండర్ల టాప్-10 మన జట్టు నుంచి అశ్విన్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు.

ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్తో ముగిసిన వన్డే సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన కోహ్లీ.. ర్యాంకింగ్స్‌లో 1258 రోజుల పాటు అగ్రస్థానాన్ని కాపాడుకోగలినప్పటికీ, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బాబర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడటంతో నంబర్‌ వన్‌ ర్యాంకు కోల్పోక తప్పలేదు.

Icc Rankings

ఇక పాకిస్తాన్‌ మరో ఆటగాడు ఫకార్‌ జమాన్‌ సౌతాఫ్రికా సిరీస్‌లో 302 పరుగులతో రాణించడంతో ఏకంగా ఏడో స్థానానికి చేరుకున్నాడు. కాగా మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ నిమిత్తం పాకిస్తాన్ జట్టు‌ ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను పాక్‌ కైవసం చేసుకోగా.. కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ ఆతిథ్య జట్టు టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఇవి కూడా చదవండి: Malaika Arora: వేలి ఉంగరం చూపిస్తూ.. మళ్ళీ వార్తల్లో నిలిచిన ఐటెం భామ మలైకా అరోరా..

Gold Smuggling : సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారం దాచుకొని దేశాలు దాటారు, చివరికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో..