16 సిక్సర్లు, 16 ఫోర్లతో డబుల్ సెంచరీలు.. టీమిండియాపై పాక్ చిచ్చరపిడుగు శివతాండవం.. ఎవరంటే

|

Dec 03, 2024 | 9:30 AM

అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చిచ్చరపిడుగు అదరగొడుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు నమోదు చేశాడు. అలాగే భారత్‌పై రికార్డు స్థాయిలో పరుగుల వరద పారించాడు.

16 సిక్సర్లు, 16 ఫోర్లతో డబుల్ సెంచరీలు.. టీమిండియాపై పాక్ చిచ్చరపిడుగు శివతాండవం.. ఎవరంటే
Ind Vs Pak
Follow us on

16 సిక్సర్లు, 16 ఫోర్లతో వీరవిహారం.. భారత్‌ను చితక్కొట్టిన పాక్ చిచ్చరపిడుగు.. ఎవరంటేఅండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌కు చెందిన చిచ్చరపడుగు పరుగుల వరద పారిస్తున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీ బాదిన ఆ బ్యాటర్.. ఇప్పుడు యూఏఈతో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. అతడు మరెవరో కాదు.. అండర్-19 ఆసియా కప్‌ మొదటి రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తం 291 పరుగులు చేసిన పాకిస్థాన్ ఓపెనర్ షాజైబ్ ఖాన్. పాక్‌కు వరుస విజయాలు అందిస్తూ.. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.

యూఏఈపై సెంచరీ కొట్టి, 6 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు షాజైబ్ ఖాన్. అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ షాజైబ్ ఖాన్ 132 పరుగులు సాధించాడు. అతడు 136 బంతుల్లో 6 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సెంచరీతో షాజైబ్ రెండో వికెట్‌కు రియాజుల్లాతో కలిసి 183 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అటు రియాజుల్లా కూడా 91 బంతుల్లో 106 పరుగులు చేయడం గమనార్హం.

భారత్‌పై 159 పరుగులు, 10 సిక్సర్లు..

అండర్-19 ఆసియా కప్‌లో భారత్‌పై షాజైబ్ ఖాన్ తొలి పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 147 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో 159 పరుగులు చేశాడు. ఈ విధంగా, టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లతో షాజైబ్ 16 సిక్స్‌లు, 16 ఫోర్లతో 291 పరుగులు చేశాడు. షాజైబ్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలవడమే కాదు.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అగ్రస్థానంలో నిలిచాడు.

భారత్‌పై విజయంతో హీరో అయ్యాడు..

భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో షాజైబ్ సెంచరీ సాధించడంతో పాకిస్థాన్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు షాజైబ్ ఖాన్. ఇక ఇప్పుడు యూఏఈతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రాణించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలబెట్టాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..