
క్రికెట్‌ను బ్యాట్స్ మెన్ లేదా బౌలర్ల ఆటగానే భావిస్తుంటారు. అయితే, ఫీల్డింగ్‌లోనూ తగ్గేదేలే అంటూ కొంతమంది ఆటగాళ్లు నిరూపిస్తుంటారు. ప్రతీ క్రికెటర్ ఫీల్డింగ్‌లో రాణించేందుకు కష్టపడుతుంటారు. అయితే, కేవలం తన ఫీల్డింగ్ ఆధారంగా జట్టులో చోటు సంపాదించగల ఆటగాడు ఒకరున్నారు. ఆ ఫీల్డర్ చేసిన ఒక రనౌట్ క్రికెట్ ప్రపంచాన్ని విస్తుగొలిపింది. అతని ఆట తరువాతే క్రికెట్‌లో ఫీల్డింగ్‌పై జట్లు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాంటి మార్స్ సెట్ చేసిన ఆటగాడి పేరు జాంటి రోడ్స్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. దక్షిణాఫ్రికా తరఫున 52 టెస్టుల్లో 35.66 సగటుతో 2532 పరుగులు చేసి 34 క్యాచ్‌లు అందుకున్నాడు. 245 వన్డేల్లో 35.11 సగటుతో 5935 పరుగులు చేసి 105 క్యాచ్‌లు పట్టేశాడు.

జాంటీ రోడ్స్ తన ఆటలో సాహసాలు చేసేందుకు భయపడలేదు. రివర్స్ స్వీప్‌లో అతని మించిన వారు లేరు. రివర్స్ స్వీప్‌లో అద్భుతమైన సిక్సర్‌ను బాదేశాడు. వన్డేల్లో 100 క్యాచ్‌లు తీసుకున్న తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా పేరుగాంచాడు. 1993 లో ముంబైలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు ఒడిసి పట్టాడు. వికెట్ కీపర్ లేదా ఫీల్డర్ చేసిన ఉత్తమ ప్రదర్శన ప్రదర్శనలో ఈ రికార్డు అత్యుత్తమంగా నిలిచింది. ప్రస్తుతం ఈ రికార్డు అతని పేరిట ఉంది.

జాంటీ రోడ్స్ 1992 ప్రపంచ కప్ నుంచి దక్షిణాఫ్రికా తరపున వన్డేలో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో జాంటీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అయితే, పాకిస్థాన్‌తో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదవ మ్యాచ్ నుంచి జాంటీ రోడ్స్ వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంజామామ్-ఉల్-హక్‌ను అద్భుతమైన రీతిలో రనౌట్ చేశాడు. ఇంజామామ్ బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ తరలించి రన్ కోసం పరిగెత్తాడు. కానీ, కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వద్దంటూ వెనుకకు వెళ్లమంటూ అరిచాడు. ఈ సమయంలో జాంటీ రోడ్స్ బంతిని పట్టుకుని గాలిలో డైవ్ చేస్తూ స్టంప్స్‌ను పడగొట్టాడు. ఈ రనౌట్ ఫోటో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుదని అనడంలో సందేహం లేదు. ఫీల్డింగ్ పరంగా ఈ సీన్ గుర్తిండిపోతోంది.

జోన్టీ రోడ్స్ హాకీలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 1992 ఒలింపిక్ క్రీడలకు జాతీయ జట్టులో ఎంపికయ్యాడు కాని అతని దేశం హాకీలో అర్హత సాధించలేకపోయింది. ఈ కారణంగా, రోడ్స్ ఒలింపిక్స్‌కు వెళ్ళలేకపోయాడు. 1996 లో కూడా ఒలింపిక్ ట్రయల్స్‌కు పిలిచారు. కానీ స్నాయువు గాయం కారణంగా జోంటీ రోడ్స్ తోసిపుచ్చారు.

జాంటీ రోడ్స్ తన ఫీల్డింగ్‌లో చాలా కష్టపడతాడు. మైదానంలో అతని ఆటతీరు చూస్తేనే అర్థమవుతోంది. గంటల కొద్ది ప్రాక్టీస్ చేస్తుంటాడు. 10 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం నుంచి క్యాచ్ లేదా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత కోచ్‌గా జాయిన్ అయ్యాడు. జాంటీ రోడ్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక టీంలకు కోచ్‌గా పనిచేశాడు. ఈ సమయంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. 2015 లో అతని రెండవ భార్య మెలానియా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు నచ్చిన జాంటీ రోడ్స్.. కుమార్తెకు ఇండియా అని పేరు పెట్టారు. అతని కుమారుడు కూడా భారతదేశంలో జన్మించడం విశేషం.