Team India: అరంగేట్రంలోనే సెంచరీ.. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన భారత మాజీ కెప్టెన్.. ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jun 22, 2022 | 7:35 AM

మైక్ అథర్టన్ కెప్టెన్సీలో, ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జాక్ రస్సెల్ (124) కీలకంగా రాణించి, ఆకట్టుకున్నాడు.

1 / 5
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితంలో జూన్ 22 తేదీ చాలా ప్రత్యేకమైనది. అదే రోజు అరంగేట్రం చేసి, టెస్టులో సెంచరీ సాధించాడు. గంగూలీ 1993లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. మ్యాచ్ మూడో రోజున సెంచరీ సాధించాడు.

2 / 5
చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో గంగూలీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 301 బంతులు ఎదుర్కొని 131 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు బాదాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు.

3 / 5
ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. గంగూలీ వికెట్‌ను లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అలాన్ ములాలీ తీశాడు. గంగూలీని ములాలీ బౌల్డ్ చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో గంగూలీకి రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

4 / 5
మైక్ అథర్టన్ కెప్టెన్సీలో, ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేసింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జాక్ రస్సెల్ (124) కీలకంగా రాణించి, ఆకట్టుకున్నాడు. గంగూలీ సెంచరీతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 429 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ 278 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది.

5 / 5
ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టుకు విజయాలు అందించాడు. గంగూలీ భారత్ తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో మొత్తం 16 సెంచరీలు చేశాడు. గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 18575 పరుగులు చేశాడు.