IND vs PAK: భారత బౌలర్ల ధాటికి పాక్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

India vs Pakistan, 12th Match: పాక్‌పై టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనే నిర్ణయం భారత్‌కు సరైనదని రుజువైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 191 పరుగులకు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు.

IND vs PAK: భారత బౌలర్ల ధాటికి పాక్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
బుమ్రాతోపాటు కుల్దీప్ యాదవ్, సిరాజ్, పాండ్యా, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టి పాక్‌ బలమైన ఆరంభాన్ని చెడగొట్టడంతోపాటు కేవలం 42.5 ఓవర్లో ఆలౌట్ చేశారు.

Updated on: Oct 14, 2023 | 5:42 PM

India vs Pakistan, 12th Match: పాక్‌పై టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనే నిర్ణయం భారత్‌కు సరైనదని రుజువైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 191 పరుగులకు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు.

పాక్‌ తరపున కెప్టెన్‌ బాబర్‌ ఆజం అర్ధశతకం సాధించాడు. వన్డేల్లో భారత్‌పై అతనికిదే తొలి అర్ధశతకం. 49 పరుగుల వద్ద రిజ్వాన్ ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

తొలుత 155 పరుగుల స్కోరు వద్ద పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బాబర్ అజామ్ పెవిలియన్ చేరాడు. బాబర్‌ పెవిలియన్‌కు వెళ్లిన తర్వాత వికెట్ల వర్షం కురిసింది. 33వ ఓవర్లో సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్ వికెట్లను కుల్దీప్ యాదవ్ తీయగా.. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 34వ ఓవర్లో మహ్మద్ రిజ్వాన్‌ను, 36వ ఓవర్‌లో షాదాబ్ ఖాన్‌ను బౌల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్యా మహ్మద్ నవాజ్ క్యాచ్ ఔట్‌తో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా హసన్ అలీ, హరీస్ రవూఫ్‌లను అవుట్ చేశాడు. ఓ దశలో భారీ స్కోర్ సాధిస్తుందని అనుకున్నా.. ఆ జట్టు 36 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో కూరుకపోయింది. దీంతో కేవలం 42.5 ఓవర్లలో పాకిస్థాన్ 191 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us