టీ20 వరల్డ్ కప్ 2021లో టాస్ కీలక పాత్ర పోషిస్తోంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలవచ్చని చెబుతున్నారు. ఫైనల్‌లో కూడా టాస్ కీలకంగా ఉంటుందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఎవరు గెలుస్తారన్నది టాస్‌ను బట్టి నిర్ణయించవచ్చని చెబుతున్నారు. ఇందుకు మూడు ఉదాహరణలు కూడా ఇస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్ మ్యాచ్ ఈరోజు దుబాయ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇప్పుడు దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 10 సార్లు టాస్ గెలిచిన జట్టు విజేతగా నిలిచింది.11 సార్లు టాస్ గెలిచి జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
అయితే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న జట్టుకూ గెలిచే అకాశం ఉందని చెబుతున్నారు. కాకపోతే వారు భారీ స్కోరు చేయాల్సి ఉంటుందన్నారు. ముందుగా బ్యాటింగ్ చేస్తే స్కోరు బోర్డులో కనీసం 180 పరుగులు చేయాలని అంటున్నారు. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దుబాయ్ మైదానంలో ఆడిన గత 20 మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసి 180 పైచిలుకు పరుగులు చేసిన ఏ జట్టు ఓడిపోలేదని చరిత్ర చెబుతోంది.
టీ20లో ఇప్పటి వరకు 6 జట్లు ప్రపంచ విజేతలుగా నిలిచాయి. ఆ అరడజను జట్లలో 5 జట్లు ఫైనల్ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి, ఆ తర్వాత మ్యాచ్‌ను గెలుచుకున్నాయి. 2009 టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్ మాత్రమే వేరుగా ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ ఓడిపోయినప్పటికీ, పాకిస్తాన్‌పై ఫైనల్‌లో గెలిచింది. గత 6 ఫైనల్స్‌లో 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా.. మూడు సార్లు మొదటగా బౌలింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది.
2021 టీ20 ప్రపంచకప్‌లో రాత్రిపూట 25 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 25 మ్యాచ్‌ల్లో 17 సార్లు టాస్ గెలిచిన జట్లు విజయం సాధించాయి. దీన్ని బట్టి చూస్తే టాస్ జట్టు మ్యాచ్ గెలిచేలా కనిపిస్తుంది.
Read Also.. AUS vs NZ Final: ఒకప్పుడు ఒకే జట్టులో ఆడారు.. ఇప్పుడు ఇతర జట్ల నుంచి పోటీ పడుతున్నారు..