RCB: అమ్మకానికి ఆర్‌సీబీపై స్పందించిన యునైటెడ్ స్పిరిట్స్.. ఏమందంటే?

Updated on: Jun 10, 2025 | 8:26 PM

No sale of RCB, Clarifies United Spirits: ఆర్సీబీ అమ్మకం జరుగుతుందనే వార్తలను యునైటెడ్ స్పిరిట్స్ ఖండించింది. రాయల్ ఛాలెంజర్స్ జట్టును అమ్మే ప్రణాళిక లేదని యునైటెడ్ స్పిరిట్స్ ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం మద్యం ప్రకటనలపై నిషేధం విధించినందున ఆర్‌సీబీని అమ్మే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి.

1 / 5
No sale of RCB, Clarifies United Spirits: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ ఫ్రాంచైజీని అమ్ముతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ఖండించింది. RCB జట్టును అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధం, ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. RCB యజమాని యునైటెడ్ స్పిరిట్స్ ఒక పత్రికా ప్రకటన ద్వారా జట్టును అమ్మడం లేదంటూ స్పష్టం చేసింది.

2 / 5
ఈ మేరకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఆర్‌సిబి జట్టును పూర్తిగా లేదా పాక్షికంగా అమ్మడం లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. క్రీడా కార్యక్రమాల్లో పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తుల ప్రమోషన్, ప్రకటనలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో, డియాజియో ఆర్‌సీబీని విక్రయించాలని పరిశీలిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ నివేదించింది.

3 / 5
RCB యాజమాన్యంలోని యునైటెడ్ స్పిరిట్స్, బ్రిటిష్‌కు చెందిన డియాజియో అనుబంధ సంస్థ. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, డియాజియో RCB కి $2 బిలియన్ల (రూ. 17,000 కోట్లు) విలువను అంచనా వేసింది.

4 / 5
ఐపీఎల్‌ను ప్రారంభించిన ఎనిమిది జట్లలో ఆర్‌సీబీ ఒకటి. మొదట్లో యునైటెడ్ స్పిరిట్స్‌ను విజయ్ మాల్యా సొంతం చేసుకున్నారు. యునైటెడ్ స్పిరిట్స్‌ను బ్రిటిష్‌కు చెందిన డియాజియో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్‌సీబీ యాజమాన్యం డియాజియోకు వెళ్లింది. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ ఈ ఏడాది తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది.

5 / 5
అయితే, ఆ తరువాత జరిగిన వేడుకలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. లక్ష మందికిపైగా అభిమానులు వేడుకలు జరుపుకోవడానికి గుమిగూడారు.