Nitish Kumar Reddy Father Touches Sunil Gavaskar Feet: నితీష్ కుమార్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్‌లో సెంచరీతో సత్త చాటాడు. ఈ క్రమంలో నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అలాగే, మ్యాచ్ అనంతరం నితీష్ తండ్రి సునీల్ గవాస్కర్ పాదాలపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో మెల్‌బోర్న్‌లో గవాస్కర్‌తో నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం సమావేశమైన సందర్భంలో చోటు చేసుకుంది. ఈ సమావేశంలో తండ్రి ఉద్వేగానికి లోనై గవాస్కర్‌ను కౌగిలించుకోకుండా ఆయన పాదాలను తాకి నమస్కరించారు. తన కుమారుడిపై ప్రశంసలు కురిపించిన మాజీ ఆటగాళ్లను కలిసి థ్యాంక్స్ తెలిపాడు.
నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి సునీల్ గవాస్కర్ పాదాలను తాకి నమస్కరించారు. అయితే, ఆయన పాటించిన విధానం కాస్త భిన్నంగా ఉంది. తండ్రి ఆ డిఫరెంట్ స్టైల్ సన్నివేశానికి ఎమోషనల్ టచ్ ఇచ్చేలా చేసింది. నితీష్ తండ్రి మోకాళ్లపై కూర్చొని గవాస్కర్ పాదాలను తాకుతూ కనిపించాడు.
Nitish Kumar Reddy’s family meet the great Sunil Gavaskar @abcsport #AUSvIND pic.twitter.com/hUBOghxM2e
— Ben Cameron (@BenCameron23) December 29, 2024
తండ్రిలాగే నితీష్ రెడ్డి సోదరి కూడా సునీల్ గవాస్కర్ పాదాలను తాకింది. ఈ సమావేశంలో సునీల్ గవాస్కర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి, అతని బ్యాటింగ్ గురించి మాట్లాడారు. ఆతనో వజ్రమని కితాబిచ్చాడు.
మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ రెడ్డి 189 బంతులు ఎదుర్కొని 114 పరుగులు చేశాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 8వ ర్యాంక్‌లో ఆడిన నితీష్‌రెడ్డి ఈ ఇన్నింగ్స్‌ను టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా పలువురు క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మెల్‌బోర్న్‌లో నితీష్ ఇన్నింగ్స్ భారత టెస్టు చరిత్రలో 8వ నంబర్ బ్యాట్స్‌మెన్ చేసిన రెండో అత్యధిక ఇన్నింగ్స్. అంతకుముందు 2002లో వెస్టిండీస్‌పై అజయ్ రాత్రా అజేయంగా 115 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్‌లో సాధించిన సెంచరీని నితీష్ కుమార్ రెడ్డి తన తండ్రికి అంకితమిచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..