CWC 2023: షకీబ్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్లు.. కోహ్లీని చూసి క్రీడా స్ఫూర్తి నేర్చుకోమంటూ కామెంట్స్..

Shakib Al Hasan Trolls: ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ప్రవర్తనతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. శ్రీలంక ఆల్-రౌండర్ ఏంజెలో మాథ్యూస్ మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ ప్రారంభించేందుకు కొంచెం సమయం పట్టింది. దీని కారణంగా షకీబ్ టైమ్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు. అంపైర్ మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో శ్రీలంక మాజీ కెప్టెన్ ఒక్క బంతి కూడా ఆడకుండానే మైదానం వీడాల్సి వచ్చింది. శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ క్రికెట్ చరిత్రలో టైం ఔట్‌గా పెవిలియన్ చేరిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

CWC 2023: షకీబ్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్లు.. కోహ్లీని చూసి క్రీడా స్ఫూర్తి నేర్చుకోమంటూ కామెంట్స్..
Hakib Al Hasan Trolled

Updated on: Nov 06, 2023 | 7:47 PM

Shakib Al Hasan Trolls over Sports Spirit: ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023) లో 37వ మ్యాచ్ శ్రీలంక వర్సె్స్ బంగ్లాదేశ్ (SL vs BAN) మధ్య జరుగుతోంది. శ్రీలంక (Sri Lanka Cricket Team), సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి ఈ మ్యాచ్ ముఖ్యమైనది. అయితే బంగ్లాదేశ్ (Bangladesh Cricket Team) ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించడానికి కూడా ఈ మ్యాచ్ ముఖ్యమైనది. అందుకే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ప్రవర్తనతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. శ్రీలంక ఆల్-రౌండర్ ఏంజెలో మాథ్యూస్ మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ ప్రారంభించేందుకు కొంచెం సమయం పట్టింది. దీని కారణంగా షకీబ్ టైమ్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు. అంపైర్ మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో శ్రీలంక మాజీ కెప్టెన్ ఒక్క బంతి కూడా ఆడకుండానే మైదానం వీడాల్సి వచ్చింది. శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ క్రికెట్ చరిత్రలో టైం ఔట్‌గా పెవిలియన్ చేరిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఐసీసీ నిబంధనల ప్రకారం షకీబ్ మాథ్యూస్‌ను అవుట్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం షకీజ్ ప్రవర్తనను క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ విమర్శించడం ప్రారంభించారు.

ఏంజెలో మాథ్యూస్‌కు టైం ఔట్‌గా ప్రకటించినందుకు షకీబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ట్విట్టర్‌లో విపరీతమైన ప్రతిచర్యలు వస్తున్నాయి.

మ్యాచ్ తర్వాత ఇద్దరి పరిస్థితి..

క్రికెటర్‌గా పనికిరాడంటూ..

సిగ్గుండాలి షకీబ్ అంటూ ట్వీట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..