Virat Kohli: విరాట్ కోహ్లీ దృష్టిలో పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్.. అతని బౌలింగ్ స్పీడ్ ఎంతంటే..

|

Oct 07, 2021 | 7:33 PM

ఐపీఎల్‎లో ఆడిన రెండో మ్యాచ్‎లోనే ఉమ్రాన్ మాలిక్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ దృష్టిలో పడ్డాడు. అర్సీబీతో జరిగిన మ్యాచ్‎లో మాలిక్ అత్యంత వేగంగా బౌలింగ్ చేశాడు. దీనిపై స్పందించిన కోహ్లీ....

Virat Kohli: విరాట్ కోహ్లీ దృష్టిలో పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్.. అతని బౌలింగ్ స్పీడ్ ఎంతంటే..
Malik
Follow us on

ఐపీఎల్‎లో ఆడిన రెండో మ్యాచ్‎లోనే ఉమ్రాన్ మాలిక్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ దృష్టిలో పడ్డాడు. అర్సీబీతో జరిగిన మ్యాచ్‎లో మాలిక్ అత్యంత వేగంగా బౌలింగ్ చేశాడు. దీనిపై స్పందించిన కోహ్లీ.. జమ్మూ కాశ్మీర్ యువకుడి ఆటను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మూకు చెందిన 21 ఏళ్ల సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‎లో152.95 కి.మీ. వేగంతో బంతులు విసిరాడు. ఇలా అతను విరాట్‎ను ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‎లో ప్రతి సంవత్సరం కొత్త ప్రతిభను బయటపడుతుందని చెప్పారు. 150 కి.మీ. వేగంతో ఒక వ్యక్తి బౌలింగ్ చేయడం మంచిదన్నారు. ఇక్కడ నుంచి వ్యక్తుల పురోగతిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని కోహ్లీ అన్నారు. ఈ మ్యాచ్‎లో ఆర్సీబీ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‎లో ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 21 పరుగులు ఇచ్చాడు.

గత ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‎లో కూడా ఉమ్రాన్ మాలిక్ ఆకట్టుకున్నారు. వికెట్ తీయలేనప్పుటికీ అతడి వేగంతో అందరిని ఆకట్టుకున్నాడు. అతను 151.03 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు. ఉమ్రాన్ మాలిక్ కూరగాయలు, పండ్ల విక్రయించే అబ్దుల్ మాలిక్ కుమారుడు. ఐపీఎల్ కోసం తన కుమారుడు పడిన కష్టాన్ని అబ్దుల్ మాలిక్ చాలా భావోద్వేగంతో చెప్పారు. తన కుమారుడు ఐపీఎల్‎కు ఎంపిక కావడం చూసి తను, తన భార్య కన్నీళ్లు పెట్టుకున్నామని వివరించారు. తన కొడుకు ఏదో ఒకరోజు భారత్ తరఫున కూడా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Read Also.. Sunrisers Hyderabad: కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కొడుకు.. ఐపీఎల్‎లో 151.03 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. ఆకట్టుకుంటున్న జమ్మూ యువకుడు..