IPL 2023 Auction: ధోని పొమ్మన్నాడు, డబుల్ సెంచరీ బాదేశాడు.. కట్ చేస్తే మినీ వేలంలో షాక్.. ఎవరంటే?

|

Dec 23, 2022 | 5:36 PM

ఇచ్చిన అవకాశాలు తక్కువ.. అందులోనూ సరిగ్గా ఆడలేదు. అంతే! జట్టుకు భారంగా మిగిలాడని మినీ వేలానికి ముందుగా అతడికి గుడ్ బై చెప్పింది..

IPL 2023 Auction: ధోని పొమ్మన్నాడు, డబుల్ సెంచరీ బాదేశాడు.. కట్ చేస్తే మినీ వేలంలో షాక్.. ఎవరంటే?
Ms Dhoni
Follow us on

ఇచ్చిన అవకాశాలు తక్కువ.. అందులోనూ సరిగ్గా ఆడలేదు. అంతే! జట్టుకు భారంగా మిగిలాడని మినీ వేలానికి ముందుగా అతడికి గుడ్ బై చెప్పింది చెన్నై సూపర్ కింగ్స్. సీన్ కట్ చేస్తే.. ఈ డొమెస్టిక్ ప్లేయర్ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. డబుల్ సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టాడు. అయినా సరిపోలేదు.. డిసెంబర్ 23న జరిగిన ఆక్షన్‌లో తక్కువ ధరకే అమ్ముడుపోయాడు. ఇంతకీ అతడెవరో తెలుసా.? ఎవరో కాదు నారాయణ్ జగదీషన్. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్.

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో నారాయణ్ జగదీషన్ చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ అవకాశాలు మాత్రమే ఇచ్చింది. జట్టుకు భారంగా నిలిచాడనుకుని వదిలేసుకుంది. కానీ మనోడు అదే కసితో విజయ్ హజారే ట్రోఫీలో దంచికోట్టాడు. కట్ చేస్తే.. మొత్తంగా 8 మ్యాచ్‌లలో జగదీషన్ 830 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ప్రదర్శన అతడికి మినీ వేలంలో జాక్‌పాట్ తగిలే ఛాన్స్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ కాస్తా రివర్సయింది. ఫామ్ లేని మిగతా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ కంటే.. జగదీషన్ అతి తక్కువకు అమ్ముడయ్యాడు.

మినీ వేలంలోకి ఎనిమిదో సెట్ అన్‌క్యాప్‌డ్ వికెట్ కీపర్ల జాబితాలో వచ్చిన జగదీషన్‌ను కొనుగోలు చేసేందుకు కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరికి కోల్‌కతా రూ. 90 లక్షలకు అతడ్ని దక్కించుకుంది. మరే ఫ్రాంచైజీ కూడా జగదీషన్‌పై ఆసక్తి చూపించలేదు.