Team India: ’30 ఏళ్లు దాటితే ముసలి వాళ్లమేనా.. ఆ సత్తా లేదనుకుంటే మీ భ్రమే’

Murali Vijay: మురళీ విజయ్ వయస్సు ప్రస్తుతం 38 సంవత్సరాలు. అతను చివరిసారిగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. గత రెండు సీజన్‌లుగా ఐపీఎల్‌లో కూడా కనిపించలేదు.

Team India: 30 ఏళ్లు దాటితే ముసలి వాళ్లమేనా.. ఆ సత్తా లేదనుకుంటే మీ భ్రమే
Murali Vijay

Updated on: Jan 14, 2023 | 12:54 PM

Murali Vijay Key Comments on BCCI: భారత క్రికెటర్ మురళీ విజయ్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అతను చివరిసారిగా 2019లో దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కనిపించాడు. అప్పటి నుంచి మైదానంలో కనిపించకుండా పోయాడు. గత సంవత్సరం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TPL) ఆడాడు. కానీ, IPL నుంచి దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రాలేకపోయాడు. దీంతో ఈ ఆటగాడు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

స్పోర్ట్స్‌స్టార్ వీక్లీ షోకి వచ్చిన మురళీ విజయ్ మాట్లాడుతూ, ‘బీసీసీఐతో నా అనుబంధం దాదాపు ముగిసింది. ఇప్పుడు నేను విదేశాలలో అవకాశాల కోసం చూస్తున్నాను. నాకు ఇంకా క్రికెట్ ఆడాలని ఉంది. భారతదేశంలో 30 ఏళ్లు వచ్చిన వెంటనే మనం అంటరానివారమవుతాం. 80 ఏళ్లు వచ్చినట్లుగా పరిగణిస్తారనుకుంటాను. మీడియా కూడా మనల్ని అలాగే చిత్రీకరిస్తుంది. నేను ఇప్పటికీ నా బెస్ట్ ఇవ్వగలనని అనుకుంటున్నాను. కానీ, దురదృష్టవశాత్తు చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నేను బయట అవకాశాలను వెతుక్కోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

మురళీ విజయ్ రికార్డ్..

ప్రస్తుతం మురళీ విజయ్ వయసు 38 ఏళ్లు. భారత్ తరపున 61 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇక్కడ అతను 3928 పరుగులు చేశాడు. భారత్ తరపున 17 వన్డేలు కూడా ఆడాడు. ఇక్కడ అతను 339 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకప్పుడు ఐపీఎల్‌లో కూడా అతని బ్యాట్ భీకరంగా పరుగులు చేసింది. IPL 2010లో అతను 15 మ్యాచ్‌లలో 156.84 స్ట్రైక్ రేట్, 35.23 సగటుతో 458 పరుగులు చేశాడు. అతను చివరిసారిగా 2020లో ఐపీఎల్ ఆడాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..