సోషల్ మీడియా దెబ్బకు భారత జట్టులో చోటు.. అరంగేట్రంలో అదిరిగొట్టేశాడు.. కట్‌చేస్తే.. బంగ్లాతో సిరీస్‌కు మొండిచేయి

|

Aug 16, 2024 | 2:04 PM

ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్భా రతదేశం తరపున మూడు టెస్టులు ఆడాడు. ఇందులో అతని పేరిట 200 పరుగులు ఉన్నాయి. ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు యాభై ప్లస్ స్కోరు సాధించాడు. కానీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పునరాగమనంతో టీమ్ ఇండియాలో ఈయన ప్లేస్ మిస్ అయ్యేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్ల ప్లాన్‌లో ఈ యంగ్ ప్లేయర్‌ని చేర్చుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

సోషల్ మీడియా దెబ్బకు భారత జట్టులో చోటు.. అరంగేట్రంలో అదిరిగొట్టేశాడు.. కట్‌చేస్తే.. బంగ్లాతో సిరీస్‌కు మొండిచేయి
Ind Vs Ban Test Sarfaraz Kh
Follow us on

Sarfaraz Khan: 2024 ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో భారత్ తరపున సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేశాడు. అయినప్పటికీ అతను సంతోషంగా కనిపించలేదు. ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఇండియా-బంగ్లాదేశ్ సిరీస్‌పై కీలక ప్రకటన చేశాడు. భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తనను ఎంపిక చేస్తారన్న నమ్మకం లేదని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు.

సర్ఫరాజ్ ఖాన్ ఏం చెప్పాడంటే?

భారత దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తోన్న సర్ఫరాజ్ ఖాన్ , తన సన్నద్ధత గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడాడు. ‘ నాకు ఎప్పుడూ ఆఫ్ సీజన్ అనేది లేదు. నేను తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి చాలా దూరం రన్నింగ్ చేస్తాను. దానివల్ల నా ఫిట్‌నెస్‌ చాలా మెరుగుపడింది. దీని కారణంగా నేను 30 నిమిషాల్లో ఐదు కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేస్తున్నాను. పరుగు పూర్తి చేసిన తర్వాత నేను జిమ్‌కి వెళ్తాను. ఈ విధంగా, రోజులో మొదటి సగం ఫిట్‌నెస్, ఫీలింగ్ కసరత్తులలో గడుపుతాను. బ్యాటింగ్ సాయంత్రం చేస్తుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ గురించి సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ సిరీస్ గురించి నేను ఆలోచించడం లేదు. కానీ నేను ప్రక్రియపై దృష్టి పెట్టాలి. వర్షం కారణంగా ముంబైలో నేను ఈ స్థాయిలో ప్రాక్టీస్ చేయలేదు. బౌలింగ్ మెషీన్‌లు, సైడ్-ఆర్మ్ త్రోయర్‌లు లేదా ఇండోర్ సౌకర్యాలలో కొన్నిసార్లు బౌలర్‌లను మాత్రమే ఎదుర్కొంటున్నాను. బాల్ బ్యాట్‌పైకి వస్తుండడంతో నాకు ఇండోర్‌లో బ్యాటింగ్ చేయడం ఇష్టం ఉండదు. కానీ, టర్ఫ్‌లో ఒక సవాలు ఉంది. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలరు. నాకు ఎలాంటి అంచనాలు లేవు, కానీ అవకాశం వస్తే నేను సిద్ధంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

మూడు టెస్టుల్లో 200 పరుగులు చేసిన సర్ఫరాజ్..

సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడితే, ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన తర్వాత, అతను భారతదేశం తరపున మూడు టెస్టులు ఆడాడు. ఇందులో సర్ఫరాజ్ ఖాన్ పేరిట 200 పరుగులు ఉన్నాయి. ఐదు ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్ మూడుసార్లు యాభై ప్లస్ స్కోరు సాధించాడు. కానీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పునరాగమనంతో టీమ్ ఇండియాలో సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్ మిస్ అయ్యేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్ల ప్లాన్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ను చేర్చుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..