MI vs LSG, IPL 2024: రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి

|

May 18, 2024 | 12:25 AM

Mumbai Indians vs Lucknow Super Giants: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కు 2024 సీజన్ ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్ లను పూర్తి చేసుకున్న ముంబై కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. తాజాగా శుక్రవారం (మే 17) లక్నోతో జరిగిన ఆఖరి మ్యాచ్ లోనూ ముంబై ఓడిపోయింది.

MI vs LSG, IPL 2024: రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని  ఓటమి
Mumbai Indians Vs Lucknow
Follow us on

Mumbai Indians vs Lucknow Super Giants: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కు 2024 సీజన్ ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్ లను పూర్తి చేసుకున్న ముంబై కేవలం నాలుగింటిలో మాత్రమే గెలిచింది. తాజాగా శుక్రవారం (మే 17) లక్నోతో జరిగిన ఆఖరి మ్యాచ్ లోనూ ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్‌ (75), కేఎల్ రాహుల్‌ (55) అర్ధశతకాలతో రాణించారు. ముంబయి బౌలర్లలో తుషారా, చావ్లా తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. దీంతో లక్నో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ (68), నమన్ ధీర్‌ (62*) చెలరేగి ఆడినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో రవిబిష్ణోయ్‌ 2, నవీనుల్‌ హక్‌ 2, కృనాల్‌ పాండ్య, మోసిన్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌తో ఇరుజట్లు తమ లీగ్ దశను ముగించాయి. ప్లే ఆఫ్ కుఅవకాశం లేకపోవడంతో ఇరు జట్లూ ఇంటి బాట పట్టాయి.

 

 

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, నెహాల్ వాద్రా, రొమారియో షెపర్డ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషారా.

ఇంపాక్ట్  ప్లేయర్లు: 

రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI:

కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.

ఇంపాక్ట్  ప్లేయర్లు:

నవీన్-ఉల్-హక్, ఆష్టన్ టర్నర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతమ్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..