DC vs MI Highlights in Telugu: తక్కువ స్కోరింగ్ మ్యాచులోనూ ఢిల్లీ క్యాపిటల్స్ టీం చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. కీలకమైన మ్యాచులో ముంబై ఇండియన్స్ టీం టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముందు 130 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ 7, డికాక్ 19, సూర్య కుమార్ 33, సౌరభ్ తివారి 15, పొలార్డ్ 6, హార్దిక్ 17, నీల్ 1, జయంత్ యాదవ్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ తలో 3 వికెట్లు, నార్ట్జే, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ఏమాత్రం కలిసి రావడం లేదు. ముఖ్యంగా రెండవ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ప్రస్తుతం మొదటి నాలుగు స్థానాల్లో చోటు సంపాధించలేకపోయింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్ టీం ఈ రోజు కచ్చితంగా గెలవాల్సిందే. శనివారం జరిగే డబుల్ హెడర్ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చేకునేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకోవడానికి చాలా దగ్గరగా ఉంది. ముంబైపై గెలిస్తే ప్లే ఆఫ్‌లో చోటు ఖాయమైనట్లే.
ఈ సీజన్‌లో ఏప్రిల్ 20 న రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ముంబై జట్టు 10 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది.
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 29 మ్యాచులు జరిగియి. ఇందులో 16 మ్యాచుల్లో ముంబై టీం గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
ప్లేయింగ్ XI :
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే
తక్కువ స్కోరింగ్ మ్యాచులోనూ ఢిల్లీ క్యాపిటల్స్ టీం చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.
18 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6 వికెట్లు నష్టపోయి 119పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 130, అశ్విన్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
అక్షర్ పటేల్ (9) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. బోల్ట్ బౌలింగ్‌లో టీం స్కోర్ 77 పరుగుల వద్ద ఎల్బీగా పెవిలియిన్ చేరాడు.
11 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం 4 వికెట్లు నష్టపోయి 74 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 13, అక్షర్ పటేట్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
పంత్ (26) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. జయంత్ యాదవ్ బౌలింగ్‌లో టీం స్కోర్ 57 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
6 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3 వికెట్లు నష్టపోయి 46 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ 21, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
స్మిత్ (9) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. నీల్ బౌలింగ్‌లో టీం స్కోర్ 30 పరుగుల వద్ద బౌల్డయ్యాడు.
4 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం 2 వికెట్లు నష్టపోయి 30 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ 7, స్మిత్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
పృథ్వీ షా (6) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో టీం స్కోర్ 15 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు.
16 గౌతమ్ గంభీర్/ శిఖర్ ధావన్
15 సురేష్ రైనా
13 అంబటి రాయుడు/ ఏబీ డివిలియర్స్
శిఖర్ ధావన్ (8) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. జయంత్ యాదవ్ బౌలింగ్‌లో టీం స్కోర్ 14 పరుగుల వద్ద పొలార్డ్ అద్భుత త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిలట్స్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
INNINGS BREAK!
Excellent bowling display from @DelhiCapitals in Sharjah! ?
3⃣ wickets each for @Avesh_6 & @akshar2026
3⃣3⃣ runs for Suryakumar Yadav
The #DelhiCapitals chase to begin soon. #VIVOIPL #MIvDC
Scorecard ? https://t.co/Kqs548PStW pic.twitter.com/AzglF3HuZT
— IndianPremierLeague (@IPL) October 2, 2021
జయంత్ యాదవ్ (11) రూపంలో ముంబై ఇండియన్స్ టీం ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 122 పరుగుల వద్ద స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
నీల్ (1) రూపంలో ముంబై ఇండియన్స్ టీం ఏడో వికెట్‌ను కోల్పోయింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 111 పరుగుల వద్ద బౌల్డయ్యాడు. 19వ ఓవర్‌లో అవేష్ ఖాన్ రెండు వికెట్లు పడొగొట్టి ముంబైను మరింత దెబ్బ తీశాడు.
హార్దిక్ పాండ్యా (17) రూపంలో ముంబై ఇండియన్స్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 109 పరుగుల వద్ద బౌల్డయ్యాడు.
17 ఓవర్లకు ముంబై ఇండియన్స్ టీం 5 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా 8, కృనాల్ పాండ్య 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
పొలార్డ్ (6) రూపంలో ముంబై ఇండియన్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. నార్ట్జే బౌలింగ్‌లో టీం స్కోర్ 87 పరుగుల వద్ద బౌల్డయ్యాడు.
సౌరభ్ తివారి (15) రూపంలో ముంబై ఇండియన్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 80 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
సూర్య కుమార్ (33 పరుగులు, 26 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో ముంబై ఇండియన్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 68 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
తొమ్మిది ఓవర్లకు ముంబై ఇండియన్స్ టీం ఒక వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. క్రీజులో సూర్య కుమార్ 24, తివారి 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
డికాక్ (19) రూపంలో ముంబై ఇండియన్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో నార్ట్జేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆరు ఓవర్లకు ముంబై ఇండియన్స్ టీం ఒక వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. క్రీజులో డికాడ్ 17, సూర్య కుమార్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
మూడు ఓవర్లకు ముంబై ఇండియన్స్ టీం ఒక వికెట్ నష్టపోయి 21 పరుగులు చేసింది. క్రీజులో డికాడ్ 5, సూర్య కుమార్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ (7) రూపంలో ముంబై ఇండియన్స్ టీం టీం స్కోర్ 8 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే
ముంబై ఇండియన్స్‌కు కీలకమైన మ్యాచులో ఢిల్లీ క్యాపిలట్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఈ సీజన్‌లో ఏప్రిల్ 20 న రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు 11 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ముంబై జట్టు 10 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది.
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 29 మ్యాచులు జరిగియి. ఇందులో 16 మ్యాచుల్లో ముంబై టీం గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
Hello & welcome from Sharjah for Match 46 of the #VIVOIPL ?
It’s the @ImRo45-led @mipaltan who square off against @RishabhPant17‘s @DelhiCapitals. ? ? #MIvDC
Which team are you rooting for❓ ? ? pic.twitter.com/tYCcBUFVlu
— IndianPremierLeague (@IPL) October 2, 2021