ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచ్.. 2027 సీజన్‌కు ముందే కీలక మార్పు..!

Mumbai Indians Women: మహిళల ప్రీమియర్ లీగ్ 2027 సీజన్‌కు ముంబయి ఇండియన్స్ కీలక మార్పు చేసింది. జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. దీంతో గత సీజన్‌లో బాధ్యతలు నిర్వర్తించిన లీసా కీట్లీ స్థానంలో విలియమ్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి కొత్త సీజన్‌లో జట్టును నడిపించనున్నాడు.

ముంబయి ఇండియన్స్‌కు కొత్త కోచ్.. 2027 సీజన్‌కు ముందే కీలక మార్పు..!
Mumbai Indians New Coach

Updated on: Sep 24, 2026 | 2:05 PM

ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) మహిళల జట్టుకు కొత్త ప్రధాన కోచ్ వచ్చాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) 2027 సీజన్ కోసం ల్యూక్ విలియమ్స్ (Luke Williams)ను హెడ్ కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ గురువారం ప్రకటించింది. గత సీజన్‌లో ఈ బాధ్యతలు నిర్వహించిన లీసా కీట్లీ (Lisa Keightley) స్థానాన్ని విలియమ్స్ భర్తీ చేయనున్నారు. డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు సీజన్లు జరగగా, ముంబయి ఇండియన్స్ రెండుసార్లు టైటిల్ గెలిచింది. 2023, 2025లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ఇప్పుడు 2027 సీజన్‌పై దృష్టి పెట్టింది. తొలి ఎడిషన్‌ నుంచి జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)తో కలిసి విలియమ్స్ పని చేయనున్నారు. కొత్త కోచ్ నియామకంతో ముంబయి మహిళల జట్టు తదుపరి సీజన్ కోసం కొత్త ప్రణాళికతో ముందుకు సాగనుంది.

లీసా కీట్లీ ముంబయి జట్టు కోచ్‌గా ఒక సీజన్ మాత్రమే పనిచేశారు. అంతకుముందు కోచ్‌గా ఉన్న షార్లెట్ ఎడ్వర్డ్స్ (Charlotte Edwards) ఇంగ్లాండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఫ్రాంచైజీని వీడారు. ఆ తరువాత కీట్లీకి బాధ్యతలు అప్పగించారు.

కీట్లీ ఆధ్వర్యంలో ముంబయి ఇండియన్స్ గత సీజన్‌లో ఐదు జట్ల పోటీలో నాలుగో స్థానంలో నిలిచింది. ఎనిమిది మ్యాచ్‌లలో జట్టు మూడు విజయాలు సాధించగా, ఐదు పరాజయాలు ఎదురయ్యాయి. ఆ సీజన్ ముగిసిన తరువాత కోచ్ మార్పు జరిగింది.

ఇవి కూడా చదవండి

ముంబయి ఇండియన్స్ సహ యజమాని నీతా అంబానీ (Nita Ambani) లీసా కీట్లీ సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త కోచ్ ల్యూక్ విలియమ్స్‌కు స్వాగతం పలుకుతూ, మహిళల క్రికెట్‌పై మంచి అవగాహనతో పాటు ఆటగాళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టే అనుభవం ఆయనకు ఉందని పేర్కొన్నారు.

ముంబయి జట్టు ఇప్పటికే డబ్ల్యూపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని నీతా అంబానీ తెలిపారు. విలియమ్స్ మార్గదర్శకత్వం, హర్మన్‌ప్రీత్ నాయకత్వంతో జట్టు మరింత ముందుకు సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

2027 సీజన్‌లో కొత్త కోచ్ బాధ్యతలు చేపట్టనున్న విలియమ్స్‌కు ఇది ముంబయి ఇండియన్స్‌తో కొత్త అధ్యాయం కానుంది. రెండు టైటిళ్లు సాధించిన జట్టు ఇప్పుడు మరోసారి విజయవంతమైన సీజన్ కోసం సిద్ధమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us