నేటి మ్యాచ్‌తో ముంబయి చరిత్ర సృష్టిస్తుందా?

ముంబయి: ఐపీఎల్‌లో చారిత్రక విజయానికి ముంబయి ఒక్క అడుగు దూరంలో ఉంది. బుధవారం చెన్నైతో జరిగే మ్యాచ్‌ గెలిస్తే ఐపీఎల్‌లో వందో విజయం నమోదు చేసిన తొలి జట్టుగా ముంబయి అవతరించనుంది. ఇప్పటివరకూ 98 మ్యాచులు గెలిచిన ఆ జట్టు 2007 మొదటి సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌పై సూపర్‌ ఓవర్‌లో ఒకసారి గెలిచింది. దీంతో మొత్తంగా 99 మ్యాచులు గెలిచిన జట్టుగా ముంబయి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక చెన్నైతో ఇవాళ్టి మ్యాచ్‌ గెలిస్తే చరిత్ర సృష్టించనుంది. […]

నేటి మ్యాచ్‌తో ముంబయి చరిత్ర సృష్టిస్తుందా?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 04, 2019 | 6:12 PM

ముంబయి: ఐపీఎల్‌లో చారిత్రక విజయానికి ముంబయి ఒక్క అడుగు దూరంలో ఉంది. బుధవారం చెన్నైతో జరిగే మ్యాచ్‌ గెలిస్తే ఐపీఎల్‌లో వందో విజయం నమోదు చేసిన తొలి జట్టుగా ముంబయి అవతరించనుంది. ఇప్పటివరకూ 98 మ్యాచులు గెలిచిన ఆ జట్టు 2007 మొదటి సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌పై సూపర్‌ ఓవర్‌లో ఒకసారి గెలిచింది. దీంతో మొత్తంగా 99 మ్యాచులు గెలిచిన జట్టుగా ముంబయి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక చెన్నైతో ఇవాళ్టి మ్యాచ్‌ గెలిస్తే చరిత్ర సృష్టించనుంది.

కాగా ఇప్పటికే మూడు వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నైను అడ్డుకోవడం ముంబయికి అంత తేలిక కాదు. చెన్నై మొత్తం సీనియర్‌ ఆటగాళ్లతో నిండి ఉన్నా అన్ని విభాగాల్లో రాణిస్తోంది. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌లో చెన్నై పటిష్టంగా ఉంది. తాహిర్‌, జడేజా, భజ్జీ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. మరోవైపు ఇతర జట్లతో పోలిస్తే ముంబయిపై చెన్నై విజయాల సంఖ్య కాస్త తక్కువగానే కనిపిస్తోంది. అలాగే వాంఖడేలో ఇరు జట్ల మధ్య జరిగిన ఎనిమిది మ్యాచుల్లో ఐదింటిని ముంబయే గెలిచింది. దీంతో బుధవారం జరగబోయే మ్యాచ్‌ ఇరు జట్లకూ కీలకంగా మారింది.

Latest Articles