ఈ వేసవి పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి..

May 02, 2024

TV9 Telugu

మల్బరీ పండ్లు ఎప్పుడైనా తిన్నారా? వీటినే బొంతపండ్లు అనికూడా అంటారు. ఈ పండ్ల శాస్త్రీయ నామం ‘మోరస్ ఆల్బా’. ఈ పండ్లు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో పండుతాయి

మల్బరీ పండ్లు నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. మల్బరీ పండినప్పుడు మాత్రం నల్లగా మారుతుంది. పండకపోతే లేత గులాబీ రంగులో ఉంటాయి

ఇవి హిపు వైలెట్ మోరేసి కుటుంబానికి చెందినవి. ఈ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. అలానే, విటమిన్లు - బి1,2,3, సి, ఇ, కెతో పాటు పొటాషియం, జింక్‌ అధికంగా ఉంటాయి

ఈ పండ్లలో జీర్ణక్రియను మెరుగుపరిచే పీచు సమృద్ధిగా ఉంటుంది. ఇది పేగు కదలికను సులభతరం చేస్తుంది. జీర్ణసంబంధిత వ్యాధులతో బాధపడే వారు రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఉపశమనం కలుగుతుంది

మల్బరీల్లో ఉండే పీచు బరువుని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే ఆంతోసైనిన్‌లు ఇందులో పుష్కలంగా ఉండి పెద్దపేగు, చర్మ, ప్రొస్టేట్‌ క్యాన్సర్లను దరిచేరనివ్వవు

ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. దీంతో గుండె, ఇతర శరీరభాగాలకి రక్తప్రసరణ సరిగ్గా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది

ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రరక్తకణాలూ వృద్ధి చెందుతాయి. రోగనిరోధకశక్తిని మెరుగు పరచడంలోనూ మల్బరీలు ప్రధానపాత్ర పోషిస్తాయి

వీటిలో ఉండే విటమిన్‌- సి ఇన్‌ఫెక్షన్లను దరిచేరనీయదు. విటమిన్‌- కె, కాల్షియం, ఐరన్‌ పోషకాలు ఎముకలు గుల్లబారకుండా కాపాడతాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి