మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ రైతుగా మారాడు. పంటలు కూడా పండిస్తున్నాడు. ధోనీ ఆవాల పంటను పండించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధోనీ తన ఆవాల పొలాల మధ్య నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధోనీ తన ఫామ్‌హౌస్‌లో 43 ఎకరాల్లో పంటల పండిస్తున్నారు. ధోనీకి సాగునీరు అందించడంలో, ఈ పంటను సిద్ధం చేయడంలో అతని వ్యవసాయ సలహాదారులు శిక్షణ ఇస్తున్నారు. మీరు ఈ వైరల్ చిత్రాలలో ధోనీతో పాటు శిక్షకుడూ రోషన్‌ను కూడా చూడవచ్చు.
భారత మాజీ కెప్టెన్ తన ఫామ్‌హౌస్‌లో అంతర పంట పద్ధతిలో ఆవాలు సాగు చేశాడు. ధోని 43 ఎకరాల ఫామ్‌హౌస్‌లో ఆవాలే కాకుండా, క్యాబేజీ, అల్లం, క్యాప్సికం వంటి అనేక కూరగాయలు కూడా పండిస్తున్నాడు. ధోనీకి గ్రీన్ వెజిటేబుల్స్ అంటే ఇష్టమని రోషన్ తెలిపాడు.
Latest pictures of Mahi in Mustard field at his farmhouse. ?❤️#MSDhoni • #Dhoni • #WhistlePodu pic.twitter.com/owSA57ccEO
— Nithish Msdian (@thebrainofmsd) January 16, 2022
Read Also.. IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా..