సచిన్‌పై ధోనీ ఫ్యాన్స్ ఫైర్!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అభిమానులు మండిపడుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆటతీరు విమర్శలకు కారణమైంది. 52 బంతులు ఆడిన ధోనీ కేవలం 28 పరుగులు మాత్రమే చేయడాన్ని సచిన్ తప్పుబట్టాడు. ధోనీ-కేదార్ జాదవ్ భాగస్వామ్యం ఏమంత బాగోలేదని, నత్తనడకను తలపించిందని అన్నాడు. స్పిన్నర్లు వేసిన 34 ఓవర్లలో కేవలం119 పరుగులు మాత్రమే వచ్చాయని, ఇది మంచిది కాదని అన్నాడు. సచిన్ ఆ మాట అనగానే ధోనీ ఫ్యాన్స్ రంగంలోకి […]

సచిన్‌పై ధోనీ ఫ్యాన్స్ ఫైర్!

Edited By:

Updated on: Jun 25, 2019 | 6:59 PM

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అభిమానులు మండిపడుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆటతీరు విమర్శలకు కారణమైంది. 52 బంతులు ఆడిన ధోనీ కేవలం 28 పరుగులు మాత్రమే చేయడాన్ని సచిన్ తప్పుబట్టాడు. ధోనీ-కేదార్ జాదవ్ భాగస్వామ్యం ఏమంత బాగోలేదని, నత్తనడకను తలపించిందని అన్నాడు. స్పిన్నర్లు వేసిన 34 ఓవర్లలో కేవలం119 పరుగులు మాత్రమే వచ్చాయని, ఇది మంచిది కాదని అన్నాడు.

సచిన్ ఆ మాట అనగానే ధోనీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. సచిన్ కంటే ధోనీనే గొప్ప అని కొందరు అంటుంటే.. ప్రపంచకప్‌లో ధోనీ కంటే సచిన్‌ చేసిన పరుగులే ఎక్కువని సచిన్ ఫ్యాన్స్ లెక్కలు చెబుతున్నారు. కొందరైతే సచిన్‌ను ట్రోల్ చేస్తూ ఫొటోలు పెడుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో ధోనీ ఇప్పటి వరకు చేసింది 90 పరుగులే అయినా, జట్టులో అతడి అవసరం ఎంతో ఉందని, బౌలర్లను బాగా గైడ్ చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించగలడంటూ అండగా నిలుస్తున్నారు.