MS Dhoni in CSK vs PBKS Match : టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేశాడు. అయితే నాన్ కెప్టెన్‌గా కేకేఆర్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ కొట్టాడు. ఆతర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 6 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసి, మెరుపులు మెరిపించాడు. అలా పంజాబ్ కింగ్స్ (CSK vs PBKS) తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు వేగంతో భానుక రాజపక్సేని ఔట్ చేసి పాత ధోనిని మళ్లీ గుర్తు చేశాడు మిస్టర్ కూల్. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో జోర్డాన్ వేసిన మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టిన రాజపక్సే, తర్వాతి బంతిని షార్ట్ మిడ్ వికెట్ వైపుకు కొట్టి పరుగు కోసం క్రీజు వదిలిపెట్టి ముందుకు వచ్చాడు. అయితే ధావన్ వద్దనడంతో మళ్లీ వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈలోపు జోర్డాన్ బంతిని అందుకుని వికెట్లకు దూరంగా విసిరాడు. అయితే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్న ఎమ్మెస్ ధోనీ, మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. ఆ సమయానికి క్రీజుకు ఇంకా అడుగు దూరంలో ఉన్న రాజపక్సే నిరాశగా పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది.
పాత ధోనిని చూస్తున్నాం!
కాగా 40 ఏళ్లు దాటినా చిరుతలా దూకి రనౌట్ చేసిన ధోనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘మునపటి ధోనిని చూస్తున్నాం’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇది టీ20 కెరీర్‌లో 350వ మ్యాచ్ కావడం మరో విశేషం. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ (372) తర్వాత అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు ఎమ్మెస్ ధోనీ.
Lightning run out by Thala Dhoni pic.twitter.com/loOkhavYOh
— mvrkguy (@mvrkguy) April 3, 2022
The agility, the sprint, the run out and fitness at the age of 40.. Just Dhoni things pic.twitter.com/CgGs8Gx03p
— mvrkguy (@mvrkguy) April 3, 2022
AC Side Effects: ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.. అయితే, జాగ్రత్త.. ఈ 7 వ్యాధుల బారిన పడే ఛాన్స్..
Mehreen Kaur Pirzada: అందాలతో అదరగొడుతున్న పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్..