Video: సిరాజ్ బౌలింగ్‌.. దెబ్బకు పిచ్‌పై అడ్డంపడ్డ బెన్‌ స్టోక్స్‌! జడేజా దగ్గరికెళ్లి చూస్తే..

మూడో టెస్టులో భారత బౌలర్లు ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. సిరాజ్ తన వేగవంతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను వణికించాడు. సిరాజ్ రెండు వికెట్లు తీయగా, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ కూడా వికెట్లు పడగొట్టారు.

Video: సిరాజ్ బౌలింగ్‌.. దెబ్బకు పిచ్‌పై అడ్డంపడ్డ బెన్‌ స్టోక్స్‌! జడేజా దగ్గరికెళ్లి చూస్తే..
Ben Stokes

Updated on: Jul 13, 2025 | 7:40 PM

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా మొహమ్మద్‌ సిరాజ్‌ బాల్‌తో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను భయపెట్టడమే కాదు.. వణికిస్తున్నాడు. ఆట నాలుగో రోజు ఆరంభంలోనే రెండు వికెట్లు తీసుకున్న సిరాజ్‌.. తొలి స్పెల్‌లో 7 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో స్పెల్‌ కోసం వచ్చి.. బెన్‌ స్టోక్స్‌కు ఊహించని షాక్‌ ఇచ్చాడు. సిరాజ్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ పిచ్‌పై అడ్డంపడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌ చివరి బాల్‌ను సిరాజ్‌ షార్ట్‌ పిచ్‌గా వేశాడు. దాన్ని బెన్‌ స్టోక్స్‌ బలంగా పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బాల్‌ కాస్త లో హైట్‌లో ఉండటంతో సరిగ్గా కనెక్ట్‌ కాలేదు. ఏకంగా గంటకు 140 కిలో మీటర్ల వేగంతో దూసుకొచ్చిన బాల్‌.. నేరుగా వచ్చి బెన్‌ స్టోక్స్‌ గాడ్‌కు తాకింది. ఎంత సేఫ్‌ గాడ్‌ ఉన్నప్పటికీ.. బాల్‌ నేరుగా తాకడంతో బెన్‌ స్టోక్స్‌ తట్టుకోలేకపోయాడు. దెబ్బకు పిచ్‌పై పడుకున్నాడు. నొప్పితో కొద్ది సేపు విలవిల్లాడాడు. టీమిండియా క్రికెటర్‌ జడేజా దగ్గరికెళ్లి ఏమైనా అందా అని చూడగా.. తర్వాత మెల్లిగా నిలిచి నిలబడ్డాడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 0 లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌. మూడో రోజు వికెట్లు నష్టపోకుండా 2 పరుగులు చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 2తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌కు సిరాజ్‌ షాక్‌ ఇచ్చాడు. బెన్‌ స్టోక్స్‌, ఓలీ పోప్‌ను అవుట్‌ చేసి టీమిండియా మంచి స్టార్ట్‌ ఇచ్చాడు. ఆ తర్వాత నితీస్‌ కుమార్‌ రెడ్డి, ఆకాశ్‌ దీప్‌ కూడా చెరో వికెట్‌ తీసుకోవడంతో ఇంగ్లాండ్‌ 87 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ కలిసి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జో రూట్‌ 38, స్టోక్స్‌ 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి