
Mohammed Shami’s Coach Rips Into Ajit Agarkar: జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసే క్రమంలో, అనుభవజ్ఞుడైన పేసర్ మహమ్మద్ షమీని విస్మరించడంపై అతని వ్యక్తిగత కోచ్, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న బీసీసీఐ ప్రీమియర్ 50 ఓవర్ల డొమెస్టిక్ టోర్నమెంట్ ‘విజయ్ హజారే ట్రోఫీ’లో షమీ అద్భుత ప్రదర్శన కనబర్చి తన ఎంపికపై ఆశలు రేకెత్తించిన సంగతి తెలిసిందే.
బెంగాల్ తరపున ఆడుతున్న 35 ఏళ్ల షమీ, ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టులో అతని పేరు ఎక్కడా కనిపించలేదు.
అగార్కర్ బృందం తనను మళ్ళీ ఎంపిక చేసేలా ఒక ఆటగాడు ఇంకేం చేయాలని షమీ కోచ్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇండియా టుడే (India Today) తో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు: “ఒక ఆటగాడు ఇంతకంటే ఇంకేం చేయగలడు? అతను ఇంకెన్ని వికెట్లు తీయాలి?” అంటూ ప్రశ్నించాడు.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ రీప్లేస్ మెంట్ వచ్చేశాడ్రోయ్.. 83 సగటుతో బడితపూజే..
భారత వన్డే జట్టులో తన శిష్యుడి ప్రయాణం ముగిసిపోయిందేమోనని కోచ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. “దీని అర్థం వారికి వన్డే జట్టులో షమీ అవసరం లేదని. కానీ దేశానికి అందించడానికి అతని వద్ద ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది,” అని ఆయన జోడించాడు.
బెంగాల్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా కూడా సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. దీనిని ఒక “అన్యాయం” అని పేర్కొన్నారు. రెవ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ: “మహమ్మద్ షమీకి సెలక్షన్ కమిటీ అన్యాయం చేసింది. ఇటీవల కాలంలో షమీ అంత అంకితభావంతో డొమెస్టిక్ క్రికెట్ ఆడిన అంతర్జాతీయ ఆటగాడు మరొకరు లేరు. దేశవాళీ క్రికెట్‌లో ఇంత కష్టపడిన తర్వాత కూడా అతని పట్ల సెలక్షన్ కమిటీ ఇలా ప్రవర్తించడం అవమానకరం” అంటూ చెప్పుకొచ్చాడు.
జస్ప్రీత్ బుమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వడంతో, ప్రస్తుత జట్టులో పేస్ విభాగం సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌ల మీద ఆధారపడి ఉంది. నాలుగో ఆప్షన్‌గా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టులో ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్ – ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.