Video: 4 ఓవర్లలో 4 వికెట్లు.. ఇదేం డేంజరస్ బౌలింగ్ బ్రో.. దెబ్బకు 5 ఓవర్లలోనే సగం జట్టు పెవిలియన్‌కు..

|

May 02, 2023 | 8:39 PM

Mohammed Shami: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్వింగ్, సీమ్‌తో విధ్వంసం సృష్టించాడు.

Video: 4 ఓవర్లలో 4 వికెట్లు.. ఇదేం డేంజరస్ బౌలింగ్ బ్రో.. దెబ్బకు 5 ఓవర్లలోనే సగం జట్టు పెవిలియన్‌కు..
Mohammed Shami
Follow us on

Mohammed Shami, GT VS DC: ఐపీఎల్ 2023 ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ పీడకలలా మారుతోంది. ఈ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ.. ఈ సీజన్‌లో 44వ మ్యాచ్‌లో చాలా దారుణంగా తయారైంది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ వణికిపోయింది. దీంతో ఐదు ఓవర్లలోనే సగం ఢిల్లీ జట్టు పెవిలియన్ చేరింది.

మహ్మద్ షమీ స్వింగ్, సీమ్ ముందు ఢిల్లీ టాప్ ఆర్డర్ మొత్తం పేకమేడలా కుప్పకూలింది. ఢిల్లీ ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 23 పరుగులు మాత్రమే. మహ్మద్ షమీ తన పేరిట ఐదు వికెట్లలో నాలుగు వికెట్లు రాసుకున్నాడు. కాగా ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

మహ్మద్ షమీ విధ్వంసం..

మహ్మద్ షమీ తొలి బంతికే ఢిల్లీని వణికించాడు. మ్యాచ్‌లో తొలి బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్‌కు పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత, డేవిడ్ వార్నర్ రనౌట్ అయ్యాడు. షమీ తన తర్వాతి ఓవర్‌లో ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ రిలే రస్సోను అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్లో షమీ రెండు వికెట్లు తీశాడు.

ఈసారి మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్ షమీకి బలయ్యారు. మనీష్ పాండే ఇచ్చిన క్యాచ్‌ను వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టగా, గార్గ్ కూడా వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. నలుగురిలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను షమీ చేతికి చిక్కారు. షమీ తన సీమ్, స్వింగ్‌పై బ్యాట్స్‌మెన్‌లను క్రీజులో డ్యాన్స్ చేపించాడు.

టీ20ని టెస్ట్ మ్యాచ్‌గా మార్చిన మహమ్మద్ షమీ..

ఢిల్లీపై మహ్మద్ షమీ బంతిని తరలించిన తీరు చూస్తుంటే టీ20లో కాకుండా టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నట్లు అనిపించింది. బంతిని రెండువైపులా స్వింగ్ చేసేలా చేశాడు. అందుకే బ్యాట్స్‌మెన్ ఈ పేసర్ ముందు నిలబడలేకపోయాడు. షమీ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 19 బంతుల్లో ఎటువంటి పరుగులు ఇవ్వలేదు. మొత్తంగా షమీ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..