Mohammed Shami Auction Price: పంజాబ్ కింగ్స్ మాజీ బౌలర్ మహమ్మద్ షమీని ఫ్రాంచైజీ రిటైన్ చేయలేదు. మహ్మద్ షమీ గత రెండు సంవత్సరాలలో టీమిండియా తరపున కొన్ని అద్భుతమైన ప్రదర్శనలతో తన పరిమిత-ఓవర్ల కెరీర్‌లో రాణించాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో షమీని గుజరాత్ టైటాన్స్ రూ.6.25 కోట్లకు దక్కించుకుంది. 2019 వేలంలో రూ. 4.8 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
వేలంలో షమీ కోసం నాలుగు జట్లు పోరాడినా చివరికి గుజరాత్ గెలిచింది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, KKR అతని కోసం పోటీ పడ్డాయి. వేలంలో షమీ కనీస ధరను రూ.2 కోట్లుగా ఉంది. షమీకి తన బేస్ ప్రైస్ కంటే ఎక్కువ డబ్బు వచ్చింది. ఇప్పటి వరకు అతడి ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే.. మొత్తం 79 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని సగటు 30.40గా ఉంది. 2019 సీజన్‌లో షమీ 19 వికెట్లు పడగొట్టాడు. 2020లో షమీ 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీశాడు. గత సీజన్‌లో పంజాబ్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ అతడిని రిటైన్ చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
Read Also..IPL 2022 Auction: కోహ్లీ టీంలోకి ధోని స్నేహితుడు.. తగ్గేదేలే అంటూ కాసులు కురిపించిన ఆర్సీబీ..