
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా-ఆస్ట్రేలియా పోరు ఎట్టకేలకు ప్రారంభమైంది. దుబాయ్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్, కూపర్ కొన్నోలీలు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే, తొలి ఓవర్ వేసిన షమీ.. ఓ అద్భుత అవకాశాన్ని వదిలేశాడు. మొదటి ఓవర్లోనే ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్ చేర్చే అవకాశం వచ్చినా.. వృథా చేశాడు. అయితే, ఇది అంత తేలికైన క్యాచ్ కాదు. సగం అవకాశం మాత్రమే. కానీ, షమీ దానిని పట్టుకుని ఉంటే ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ తగిలేది.
Rohit Sharma’s captaincy 🔥 got Travis Head wicket.#INDvsAUS
ఇవి కూడా చదవండి— S. (@RealGoat_45) March 4, 2025
మ్యాచ్‌లో ఇది మొదటి లీగల్ బాల్. మహమ్మద్ షమీ ఒక లెంగ్త్ డెలివరీని మిడిల్, లెగ్‌లోకి సంధించాడు. ట్రావిస్ హెడ్ దానిని లెగ్ సైడ్ వైపునకు పంపేందుకు ప్రయత్నించాడు. కానీ, బౌలర్ కుడి వైపున లీడింగ్ ఎడ్జ్ తీసుకుంది. షమీ క్యాచ్ తీసుకోవడానికి తన చేతిని చాచాడు. కానీ, బంతిని పట్టుకోలేకపోయాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది.
ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్స్‌ప్రెషన్స్ కెమెరా కంటికి చిక్కాయి. మొదట ఆనందంతో ఎగిరి, ఆపై నిరాశతో పైకి చూశాడు. షమీ మరో ఓపెనర్ కూపర్ కొన్నోలీ వికెట్ తీసుకున్నాడు.
అనంతరం ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్లో 17 పరుగులు రాబట్టాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో, ట్రావిస్ హెడ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు, అందులో ఒక ఫోర్, ఒక సిక్సర్ ఉన్నాయి. 5వ ఓవర్లో, షమీ వేసిన బంతికి ట్రావిస్ హెడ్ వరుసగా 3 ఫోర్లు బాదాడు. అతను 3వ, 4వ, 5వ బంతులను బౌండరీ లైన్ దాటి కొట్టాడు. దీంతో మరోసారి భారత జట్టుకు తలనొప్పిలా మారిన్ హెడ్ వికెట్ కోసం రోహిత్ స్పిన్నర్లను రంగంలోకి దింపాడు.
9వ ఓవర్లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో టీమిండియాకు తలనొప్పి తగ్గింది. వరుణ్ తన మొదటి ఓవర్‌లో రెండో బంతికే హెడ్‌ను ఇంటికి పంపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..