
భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన, పోరాట పటిమ, నిర్విరామ ఆటతో హీరో అయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బర్మింగ్‌హామ్‌లో ఆరు వికెట్లు, ది ఓవల్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించి మంచి జోష్‌లో ఉన్నాడు. తాజాగా ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా 15వ స్థానాన్ని సంపాదించాడు.
సిరాజ్ పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చాడు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఈ రోజు టీమిండియాకు హీరో అయ్యాడు. అలాంటి సిరాజ్‌కు వాచ్‌లంటే చాలా ఇష్టం. అతని వద్ద బోలెడన్ని వాచ్‌లు ఉన్నాయి. అందులో కొన్ని చాలా విలువైనవి.. అంటే కోట్లు విలువ చేసే ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి. సిరాజ్ వాచ్ కలెక్షన్‌పై ఓ లుక్కేస్తే..
తన తొలినాళ్లలో నిరాడంబరమైన కాసియో నుండి కోట్లాది రూపాయల విలువైన రోలెక్స్, హబ్లాట్ టైమ్‌పీస్‌ల వరకు సిరాజ్ వాచ్ గేమ్ అతని బౌలింగ్ లాగానే వేగవంతమైనది. సిరాజ్ లగ్జరీ వాచ్ కలెక్షన్ మొత్తం అంచనా విలువ: రూ.5.68 కోట్లు (సుమారుగా).
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి