MI vs SRH Highlights, IPL 2022: పోరాడి ఓడిన ముంబై.. మూడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం

| Edited By: Rajeev Rayala

May 17, 2022 | 11:28 PM

Mumbai Indians vs Sunrisers Hyderabad Live Score in Telugu: తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 194 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

MI vs SRH Highlights, IPL 2022: పోరాడి ఓడిన ముంబై.. మూడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం
Mumbai Indians Vs Sunrisers Hyderabad

ఐపీఎల్ 2022లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఎంఐ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 194 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. SRH తరపున రాహుల్ త్రిపాఠి అత్యధిక పరుగులు చేశాడు. కేవలం 44 బంతుల్లోనే అతని బ్యాట్‌ నుంచి 76 పరుగులు వచ్చాయి. అదే సమయంలో, ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ ఆడుతున్న ప్రియమ్ గార్గ్ 42, నికోలస్ పూరన్ 38 పరుగులు చేశారు. ముంబై తరఫున రమణదీప్ సింగ్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇరుజట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్, నికోలస్ పూరన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 17 May 2022 11:26 PM (IST)

    పోరాడి ఓడిన ముంబై..

    మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన సన్ రైజర్స్

  • 17 May 2022 11:17 PM (IST)

    వరుసగా వికెట్లు కోల్పోతున్న ముంబై

    7 వికెట్ కోల్పోయిన ముంబై..  19 ఓవర్లకు పూర్తయ్యేసరికి ముంబై స్కోర్ 175/7

  • 17 May 2022 11:08 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ..

    144 పరుగుల వద్ద 5 వికెట్ కోల్పోయిన ముంబై..

  • 17 May 2022 10:59 PM (IST)

    వరుస వికెట్లు కోల్పోతున్న ముంబై..

    నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్.. 15 ఓవర్లకు స్కోర్ 127/4

  • 17 May 2022 10:52 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ముంబై..

    తిలక్ వర్మ రూపంలో మూడో వికెట్ కోల్పోయిన ముంబై.. స్కోర్ ఎంతంటే 123/3

  • 17 May 2022 10:38 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన ముంబై

    రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. ఇషాన్ కిషన్ 43 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. స్కోర్ 101/2

  • 17 May 2022 10:32 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన ముంబై

    48 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు.. స్కోర్ 95/1

  • 17 May 2022 10:30 PM (IST)

    10 ఓవర్లకు ముంబై స్కోర్ ఎంతంటే..

    10 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై 93 పరుగులు చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడుతోంది ముంబై .. రోహిత్ -48

    ఇషాన్ -37

  • 17 May 2022 10:08 PM (IST)

    ఆచితూచి ఆడుతున్న ముంబై

    ఆచితూచి ఆడుతున్న ముంబై .. రోహిత్ శర్మ 27 ఇషాన్ కిషన్ 23 పరుగులతో రాణిస్తున్నారు.. స్కోర్.. 6 ఓవర్లకు 53 పరుగులు చేసిన ముంబై

  • 17 May 2022 09:50 PM (IST)

    3 ఓవర్లకు ముంబై స్కోర్..

    3 ఓవర్లు ముగిసే సరికి ముంబై టీం వికెట్ కోల్పోకుండా 20 పరుగులు చేసింది. రోహిత్ 9, ఇషాన్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 17 May 2022 09:24 PM (IST)

    ముంబై ముందు భారీ టార్గెట్..

    20 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 69, ప్రియం గార్గ్ 42, నికోలస్ పూరన్ 37 పరుగులతో ఆకట్టుకున్నారు. దీంతో ముంబై ముందు 194 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.

  • 17 May 2022 09:14 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    మార్క్రాం (2) రూపంలో హైదరాబాద్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. మెరిడిత్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 17.6 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ టీం 175 పరుగులు చేసింది.

  • 17 May 2022 09:10 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    రాహుల్ త్రిపాఠి (76) రూపంలో హైదరాబాద్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. రమణదీప్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 17.2 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ టీం 174 పరుగులు చేసింది.

  • 17 May 2022 09:02 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    నికోలస్ పూరన్ (38) రూపంలో హైదరాబాద్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. మెరిడిత్ బౌలింగ్‌లో మార్కాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 17 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ టీం 173 పరుగులు చేసింది.

  • 17 May 2022 08:52 PM (IST)

    16 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    16 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 69, నికోలస్ పూరన్ 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 17 May 2022 08:41 PM (IST)

    14 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    14 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 50, నికోలస్ పూరన్ 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 17 May 2022 08:23 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్..

    ప్రియం గార్గ్(42) రూపంలో హైదరాబాద్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. రమన్ దీప్ సింగ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ టీం 97 పరుగులు చేసింది.

  • 17 May 2022 08:09 PM (IST)

    8 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    8 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 32, ప్రియం గార్గ్ 30 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 17 May 2022 07:48 PM (IST)

    Mumbai vs Hyderabad, LIVE Score: మూడు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..

    మూడు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 5, ప్రియం గార్గ్ 9 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 17 May 2022 07:37 PM (IST)

    ఓపెనర్‌గా ప్రియమ్‌ గార్గ్‌..

    హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. వరుసగా విఫలమవుతోన్న కెప్టెన్‌ విలియమ్సన్‌ స్థానంలో ప్రియమ్‌ గార్గ్‌ ఓపెనింగ్‌కు వచ్చాడు. అతనికి తోడుగా అభిషేక్‌ శర్మ క్రీజులో ఉన్నాడు. 1.3 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 11/0.

  • 17 May 2022 07:17 PM (IST)

    Mumbai vs Hyderabad, LIVE Score: ముంబై ఇండియన్స్ జట్టు..

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే

  • 17 May 2022 07:16 PM (IST)

    Mumbai vs Hyderabad, LIVE Score: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు..

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్, నికోలస్ పూరన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

  • 17 May 2022 07:04 PM (IST)

    Mumbai vs Hyderabad, LIVE Score: టాస్ గెలిచిన ముంబై..

    హైదరాబాద్ టీంకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ముంబై టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 17 May 2022 06:57 PM (IST)

    Mumbai vs Hyderabad, LIVE Score: హైదరాబాద్‌కు డూ ఆర్ డై మ్యాచ్

    సన్‌రైజర్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత వరుసగా ఐదు ఓడిపోయింది. ఈ కారణంగా, ప్లే ఆఫ్ రేసు చాలా కష్టంగా మారింది. ఈరోజు ఓడిపోతే ప్లేఆఫ్‌కు వెళ్లాలన్న ఆశలు గల్లంతైనట్లే.

  • 17 May 2022 06:56 PM (IST)

    Mumbai vs Hyderabad, LIVE Score: ముంబైతో హైదరాబాద్ పోరు..

    నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ప్లేఆఫ్ రేసులో లేనటువంటి ముంబయికి ఇది కేవలం లాంఛనప్రాయమే కాగా, మరోవైపు హైదరాబాద్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్.

Follow us on