KKR vs GT : రూ.18 కోట్లు.. కేవలం 8 బంతులు..ఒక్క బాల్ కి 2 కోట్లు.. ఐపీఎల్‌లో కేకేఆర్ కొంపముంచిన శ్రీలంక బౌలర్

KKR vs GT : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు మతీషా పతిరానా రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య, ఏకంగా రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్.. తీరా మైదానంలోకి వచ్చాక కేవలం 8 బంతులు మాత్రమే వేసి గాయంతో వెనుదిరిగాడు.

KKR vs GT : రూ.18 కోట్లు.. కేవలం 8 బంతులు..ఒక్క బాల్ కి 2 కోట్లు.. ఐపీఎల్‌లో కేకేఆర్ కొంపముంచిన శ్రీలంక బౌలర్
Pathirana

Updated on: May 17, 2026 | 7:06 AM

KKR vs GT : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు మతీషా పతిరానా రూపంలో ఒక పెద్ద షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య, ఏకంగా రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్.. తీరా మైదానంలోకి వచ్చాక కేవలం 8 బంతులు మాత్రమే వేసి గాయంతో వెనుదిరిగాడు. 11 మ్యాచ్‌ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన డెబ్యూ మ్యాచ్ ఆడిన పతిరానా, ఇలా రెండో ఓవర్‌లోనే గాయపడటంతో కేకేఆర్ అభిమానుల సహనం నశించింది. ఒక్కో బంతికి దాదాపు 2.25 కోట్లు తీసుకున్నావ్ కదయ్యా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లతో హోరెత్తిస్తున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ ఆరంభం నుంచి గాయాల సమస్యతో సతమతమవుతోంది. ముఖ్యంగా పతిరానా కోసం టీమ్ మేనేజ్‌మెంట్ 11 మ్యాచ్‌ల పాటు ఓపికగా వేచి చూసింది. టి20 వరల్డ్ కప్ సమయంలో గాయపడిన అతను కోలుకుంటాడని ఆశపడ్డారు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి వచ్చాడు. మొదటి ఓవర్ బాగానే వేసినా, రెండో ఓవర్ రెండో బంతి వేసే సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది, మరో బంతి వేసి నొప్పితో కుంటుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.

పతిరానా తీరుపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రూ.18 కోట్లు పెట్టి కొంటే కేవలం 8 బంతులు వేసి వెళ్ళిపోతావా? అని ఎక్స్‌ వేదికగా మండిపడుతున్నారు. కొందరైతే సిఎస్‌కే టీమ్ ఇతన్ని వదిలేసి చాలా మంచి పని చేసింది అని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు వచ్చే సీజన్‌లో పతిరానాను కేకేఆర్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తుందని జోస్యం చెబుతున్నారు. అజింక్య రహానే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, పతిరానా.. ఈ ముగ్గురిని వదిలేస్తే కేకేఆర్ వద్ద మరో 30 కోట్ల పర్స్ మనీ ఉంటుందని ఫ్యాన్స్ లెక్కలు వేస్తున్నారు.

ఈ సీజన్ కోల్‌కతాకు ఏమాత్రం కలిసి రావడం లేదు. స్టార్ బౌలర్ హర్షిత్ రాణా టోర్నీ మొదలవ్వక ముందే దూరం కాగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా అందుబాటులో లేడు. మరోవైపు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా గాయంతోనే ఇబ్బంది పడుతూ బౌలింగ్ చేస్తున్నాడు. కేమరూన్ గ్రీన్ కూడా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పతిరానా లాంటి కీలక బౌలర్ ఇలా చేతులెత్తేయడం కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. ప్రస్తుతం 9 పాయింట్లతో ఉన్న కేకేఆర్.. మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరుతుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us