LSG vs PBKS, IPL 2024: మయాంక్ మాయాజాలం.. పంజాబ్‌పై లక్నో ఘన విజయం.. ధావన్ పోరాటం వృథా

ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంత గడ్డపై శనివారం (మార్చి 30) రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఈమ్యాచ్ లో టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

LSG vs PBKS, IPL 2024: మయాంక్ మాయాజాలం.. పంజాబ్‌పై లక్నో ఘన విజయం.. ధావన్ పోరాటం వృథా
LSG vs PBKS IPL Match

Updated on: Mar 31, 2024 | 12:06 AM

ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంత గడ్డపై శనివారం (మార్చి 30) రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. ఈమ్యాచ్ లో టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్‌ (54) అర్ధశతకంతో అలరించగా.. కెప్టెన్ పూరన్‌ (42), కృనాల్‌ పాండ్యా (43 నాటౌట్) మెరుపులు మెరిపించారు. 200 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పంజాబ్‌ మొదట బాగానే ఆడింది. ఓపెనర్లు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (70), బెయిర్‌స్టో (42) ధాటిగా ఆడారు. మొదటి వికెట్ కు 102 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. అయితే మిడిలార్డర్ తడబడింది. అరంగేట్ర ఆటగాడు మయాంక్‌ యాదవ్‌ మాయాజాలం ధాటికి . ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (19), జితేష్‌ శర్మ (6), సామ్‌ కరన్‌ (0) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. లివింగ్‌స్టోన్‌ (28*) ధాటిగానే ఆడినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. లక్నో టీమ్ లో కొత్త ఆటగాడు మయాంక్‌ యాదవ్‌ 3 వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. మోసిన్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. కాగా ఈ సీజన్ లో లక్నోకు మొదటి విజయం కాగా, పంజాబ్ కు రెండో ఓటమి.

 

ఇవి కూడా చదవండి

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్ ( వికెట్ కీపర్ ), KL రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..