Lucknow super giants vs Mumbai Indians IPL 2023, Eliminator Live Score in Telugu: ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై ముంబయి ఇండిన్స్ 81 పరుగుల తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 101 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్లలో మద్వాల్ 5 వికేట్లు, జోర్డాన్, పియూశ్ చెరో వికెట్ తీశారు. ఇక క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ గుజరాత్‌తో ఆడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌లో చైన్నైతో తలపడుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ప్రారంభమైంది. లీగ్ చరిత్రలో ఇరు జట్లు మూడుసార్లు తలపడగా, లక్నో మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో టీం తొలుత బౌలింగ్ చేయనుంది.
ఇరు జట్లలో గెలిచిన జట్టు ఫైనల్ చేరాలంటే మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగనుంది. కాగా, ఓడిన జట్టు ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ బదోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మధ్య MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరుగుతోంది. ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ముందు 183 పరుగుల టార్గెట్ నిలిచింది.
చెపాక్ మైదానంలో కెమెరాన్ గ్రీన్ 23 బంతుల్లో 41 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశాడు. చివరిగా నెహాల్ వధెరా 12 బంతుల్లో 23 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
లక్నో బౌలర్లలో నవీన్-ఉల్-హక్ 38 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ముంబై 17.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇక లక్నో బౌలర్లలో నవీన్ 4, యష్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు.
ముంబై 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ 26, డేవిడ్ 9 పరుగులతో నిలిచారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ 3, యష్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.
ముంబై 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ 13, డేవిడ్ 4 పరుగులతో నిలిచారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ 3, యష్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.
ముంబై 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజులో కెమెరూన్ గ్రీన్ 41, సూర్య 27 పరుగులతో నిలిచారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్, యష్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
ముంబై 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో కెమెరూన్ గ్రీన్ 23, సూర్య 9 పరుగులతో నిలిచారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్, యష్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
ముంబై 4.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో కెమెరూన్ గ్రీన్ 8, సూర్య ఉన్నారు.
3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. రోహిత్ 11, ఇషాన్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ బదోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వల్.
టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో టీం తొలుత బౌలింగ్ చేయనుంది.
ముంబై ఇండియన్స్ గ్రూప్ దశలోని చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను గెలుచుకుంది. ముంబై బ్యాటింగ్ లైనప్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ సీజన్‌లో ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్ ఇద్దరూ సెంచరీలు చేశారు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ టీం లక్నో సూపర్‌జెయింట్‌ను ఓడించలేకపోయింది. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి.
ఓడిన జట్టు ఇంతటితో లీగ్‌కు గుడ్‌బై చెప్పనుండగా.. గెలిచిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. అయితే, ఇరుజట్లు కూడా తమ శాయశక్తులా పోరాడి, ఫైనల్ చేరే లక్ష్యంతోనే బరిలోకి దిగనున్నాయి.
LSG వరుసగా రెండోసారి IPL ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గత సీజన్‌లోనూ లక్నో అర్హత సాధించింది. చివరిసారిగా ఎలిమినేటర్‌లో బెంగళూరుపై ఓడిపోయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.