
Lucknow Super Giants vs Delhi Capitals Highlights Telugu: కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐపీఎల్ టోర్నీలో మూడో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల టార్గెట్‌ను ఆ జట్టు 2 బంతులు ఉండాగానే అందుకుంది. క్వింటన్ డికాక్(80) రన్స్ తో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తర్వాత, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో మొదట డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైని ఓడించి, ఆపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ను కూడా ఓడించింది . పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
లక్నో (ప్లేయింగ్ XI) – KL రాహుల్ (C), క్వింటన్ డి కాక్ (WK), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృష్ణప్ప గౌతమ్ (మనీష్ పాండే కోసం), జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, ఆండ్రూ టై, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
ఢిల్లీ (ప్లేయింగ్ XI) – పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (టిమ్ సీఫెర్ట్ తరుపున), సర్ఫరాజ్ ఖాన్ (మన్‌దీప్ సింగ్ తరపున), రిషబ్ పంత్ (C/WK), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నోర్ట్జే (ఖలీల్ అహ్మద్ కోసం).
IPL-2022 14వ రోజున కెఎల్. రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్.. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది.
లోకేశ్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్ 4 పాయింట్లతో లీగ్ పట్టికలో 5వ స్థానంలో ఉంది. మరోవైపు రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ 2 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
లక్నో విజయానికి చివరి ఓవర్ లో 5 పరుగుల కాగా శార్దూల్ వేసిన మొదటి బంతికే ఔటయ్యాడు దీపక్ హుడా (11).
లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 80 పరుగులు చేసిన డికాక్‌ను కుల్‌దీప్ యాదవ్ ఔట్ చేశాడు. మరోవైపు క్రీజులో దీపక్ హుడా (7) ఉన్నాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 24 బంతుల్లో 28 పరుగులు అవసరం.
లక్నో స్కోరు వంద దాటింది. క్రీజులో డికాక్ (62), దీపక్ హుడా (5) ఉన్నారు. విజయానికి ఇంకా 39 బంతుల్లో 49 పరుగులు అవసరం
లక్నో రెండో వికెట్ కోల్పోయింది. లలిత్ యాదవ్ బౌలింగ్‌లో ఎవిన్ లూయిస్ (5) కుల్‌దీప్ యాద్ చేతికి చిక్కాడు. 13 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు 90/2. విజయానికి 42 బంతుల్లో 60 పరుగులు అవసరం.
ఓపెనర్ క్వింటన్ డికాక్ అర్ధ సెంచరీ (36 బంతుల్లో 52) పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా ఎవిన్ లూయిస్ (4) క్రీజులో ఉన్నాడు. లక్నో విజయానికి 49 బంతుల్లో 65 పరుగులు అవసరం
లక్నో మొదటి వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతోన్న కెప్టెన్ రాహుల్ (24)ను కుల్ దీప్ బోల్తా కొట్టించాడు. మరోవైపు క్వింటన్ డికాక్ (47) సంయమనంతో ఆడుతున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 74/1. ఆ జట్టు విజయానికి ఇంకా 60 బంతుల్లో 76 పరుగులు అవసరం.
లక్నో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు దాటింది. క్రీజులో డికాక్ 37 పరుగులు, కెఎల్ రాహుల్ 12 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 77 బంతుల్లో 93 పరుగులు చేయాల్సి ఉంది.
5 ఓవర్లలో లక్నో 45 పరుగులు చేసింది. క్రీజులో డికాక్ 34 పరుగులు, కెఎల్ రాహుల్ 9 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 90 బంతుల్లో 105 పరుగులు చేయాల్సి ఉంది.
మొదటి ఓవర్లో 5 పరుగులు, రెండో ఓవర్లో 2 పరుగులుమాత్రమే వచ్చాయి. మూడో ఓవర్ నుంచి క్వింటన్ డికాక్ వేగం పెంచాడు. 18 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేశాడు.
150 పరుగుల లక్ష్యంతో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, కెప్టెన్ కెఎల్ రాహుల్ వచ్చారు.
ఢిల్లీ 20 ఓవర్లకి మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లక్నో టార్గెట్ 150 పరుగులుగా నిర్దేశించింది. పంత్ 39 పరుగులు, సర్పరాజ్ 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఢిల్లీ 100 పరుగులు దాటింది. 15.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. పంత్ 12 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 17 పరుగులతో ఆడుతున్నారు.
15 ఓవర్లకి ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ 12 పరుగులు, సర్పరాజ్ 16 పరుగులతో ఆడుతున్నారు.
ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. పావెల్ 3 పరుగులకి ఔటయ్యాడు. రవి బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. దీంతో ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.
10 ఓవర్లకి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ 3 పరుగులు, పావెల్ 3 పరుగులతో ఆడుతున్నారు.
ఢిల్లీ 69 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 4 పరుగులకే ఔటయ్యాడు. రవి బౌలింగ్‌లో ఆయుష్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.
ఢిల్లీ మొదటి వికెట్ కోల్పోయింది. ఫృధ్వీషా 61 పరుగులకి ఔటయ్యాడు. గౌతమ్ బౌలింగ్‌లో డి కాక్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో ఢిల్లీ ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
ఫృధ్వీషా మంచి జోరుమీదున్నాడు. హాప్ సెంచరీ సాధించాడు. 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ 6.5 ఓవర్లలో 57 పరుగులు చేసింది.
ఢిల్లీ 5.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా యాబై పరుగులు చేసింది. పృధ్వీషా 47 పరుగులు, వార్నర్ 3 పరుగులతో ఆడుతున్నారు.
ఢిల్లీ 5 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ఫృధ్వీషా 22 బంతుల్లో 40 పరుగులు, డేవిడ్ వార్నర్ 8 బంతుల్లో 3 పరుగులతో ఆడుతున్నారు.
ఫృధ్వీషా వేగంగా ఆడుతున్నాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ 13 పరుగులు చేసింది.
బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్. ఫృధ్వీషా, డేవిడ్ వార్నర్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.