IND vs ENG: లార్డ్స్ టెస్ట్ గెలవాలంటే టీమిండియా ఈ 3 పనులు చేయాల్సిందే.. బాధ్యతంతా రాహుల్ పంత్‎లదే

లార్డ్స్ టెస్ట్‌లో విజయం సాధించాలంటే భారత జట్టు మూడో రోజు ఆటలో కొన్ని కీలకమైన పనులు చేయాల్సి ఉంది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ భాగస్వామ్యం, భారీ స్కోరు సాధించడం, మొదటి గంటలో వికెట్లు కాపాడుకోవడం వంటి వ్యూహాలపై టీమిండియా దృష్టి పెట్టాలి.

IND vs ENG: లార్డ్స్ టెస్ట్ గెలవాలంటే టీమిండియా ఈ 3 పనులు చేయాల్సిందే.. బాధ్యతంతా రాహుల్ పంత్‎లదే
Ind Vs Eng

Updated on: Jul 12, 2025 | 5:28 PM

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఉత్కంఠ దశకు చేరుకుంది. శనివారం లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆట చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లార్డ్స్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చాలావరకు తెలిసిపోతుంది. ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. భారత జట్టు ఇప్పటివరకు 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 53, రిషబ్ పంత్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇక్కడి నుండి భారత్ విజయం సాధించాలంటే మూడో రోజు ఈ 3 ముఖ్యమైన పనులు చేయాలి. అవేంటో చూద్దాం.

1. మొదటి గంటలో వికెట్లు కాపాడుకోవాలి

కేఎల్ రాహుల్ 53, రిషబ్ పంత్ 19 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. టీమిండియా 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ప్రారంభమైనప్పుడు.. భారత్ మొదటి సెషన్‌లో ముఖ్యంగా మొదటి గంటలో వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తపడాలి. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉదయం మొదటి గంటను జాగ్రత్తగా ఆడితే ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లపై పైచేయి సాధించవచ్చు. ఇంగ్లాండ్ బౌలర్లు మ్యాచ్ ప్రారంభంలో ఒక గంటలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోతే వారు ఒత్తిడికి గురవుతారు. దీనిని రాహుల్, పంత్‌లు సద్వినియోగం చేసుకోవచ్చు.

2. రాహుల్, పంత్ 200+ పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాలి

కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ నాలుగో వికెట్‌కు ఇప్పటివరకు 38 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మూడో రోజు 200 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పితే, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించగలదు. ఈ సందర్భంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరూ సెంచరీలు సాధించాలి. కేఎల్ రాహుల్ గతంలో 2021 టెస్ట్ సిరీస్‌లో లార్డ్స్ మైదానంలో అద్భుతమైన సెంచరీ చేశాడు. భారత్ ఇంగ్లాండ్ స్కోరు (387)ను అధిగమించాలంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరూ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాలి.

3. గెలుపు కోసం భారత్ 500 పరుగులు చేయాలి

లార్డ్స్ టెస్ట్‌లో భారత్ విజయం సాధించాలంటే మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 500 పరుగులు చేయాలి. భారత్ మొదటి లక్ష్యం ఇంగ్లాండ్ చేసిన 387 పరుగుల స్కోరును అధిగమించడం. ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్‌లు ఇంగ్లాండ్ బౌలర్లపై దూకుడుగా ఆడి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాలి. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 500 పరుగులు చేస్తే, 100 పరుగులకు పైగా ఆధిక్యం లభిస్తుంది. లార్డ్స్ మైదానంలో మొదటి ఇన్నింగ్స్‌లో 100 పరుగులకు పైగా ఆధిక్యం సాధిస్తే, ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టడానికి భారత్‌కు సువర్ణావకాశం లభిస్తుంది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..