Mohammed Siraj : రేపు ఏం జరుగుతుందో తెలిదు..మ్యాచ్ మధ్యలో ఫుట్‌బాల్ స్టార్‎కు సిరాజ్ నివాళి

లార్డ్స్ టెస్ట్‌లో వికెట్ తీసిన తర్వాత మొహమ్మద్ సిరాజ్ ఫుట్‌బాల్ ప్లేయర్ డియోగో జోటాకు నివాళిగా మ్యాచ్ మధ్యలో ఒక ప్రత్యేక సంజ్ఞ చేశాడు. జీవితం ఎంత అనూహ్యమైందో తెలిపాడు. సిరాజ్ భావోద్వేగ వ్యాఖ్యలు, ఈ ఘటన వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

Mohammed Siraj : రేపు ఏం జరుగుతుందో తెలిదు..మ్యాచ్ మధ్యలో ఫుట్‌బాల్ స్టార్‎కు సిరాజ్ నివాళి
Diogo Jota

Updated on: Jul 12, 2025 | 3:55 PM

Mohammed Siraj : లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీసిన తర్వాత చాలా మందికి అర్థం కాని సంజ్ఞ చేశాడు. దీని గురించి సిరాజ్ స్వయంగా వివరించాడు. ఇటీవలే కారు ప్రమాదంలో చనిపోయిన పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ డియోగో జోటాకు నివాళిగా అలా చేశానని చెప్పాడు. జోటా జెర్సీ నంబర్ 20ను చూపిస్తూ ఆ సంజ్ఞ చేశానని సిరాజ్ తెలిపాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ రెండో రోజున తాను చేసిన సంజ్ఞపై భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ స్పందించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బ్రైడాన్ కార్స్‎ను అవుట్ చేసిన తర్వాత, సిరాజ్ దివంగత ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియోగో జోటాకు నివాళిగా తన జెర్సీ నంబర్ 20ను చూపిస్తూ సంజ్ఞ చేశాడు. ఈ ఘటన గురించి మాట్లాడిన సిరాజ్ జీవితం చాలా అమూల్యమైనది చెప్పుకొచ్చాడు.

జూలై 3న స్పెయిన్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ ఆటగాడు జోటా మరణించాడు. ఈ వార్త విని సిరాజ్ చాలా బాధపడ్డాడు. తాను పోర్చుగల్ జట్టు అభిమానినని, అందుకే జోటా మరణం తనను కలిచివేసిందని చెప్పాడు. సిరాజ్ మాట్లాడుతూ, “మాకు జోటా చనిపోయాడని తెలిసినప్పుడు నేను షాక్‌కు గురయ్యాను. జీవితం చాలా అనూహ్యమైంది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కారు ప్రమాదంలో ఇలా జరగడం నమ్మలేకపోయాను. అందుకే నాకు వికెట్ దొరికినప్పుడు, జోటాకు నివాళిగా ఈ సంజ్ఞ చేశాను” అని అన్నాడు. సిరాజ్ చేసిన ఈ పని చాలా మందిని కదిలించింది.

లార్డ్స్ టెస్ట్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌ను వారి మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే కట్టడి చేయగలిగింది. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. భారత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్ రాణించారు. భారత జట్టు ఈ మ్యాచ్‌లో మంచి పొజిషన్లో ఉంది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..