Sanju Samson : సంజూ శాంసన్ కెరీర్ క్లైమాక్స్..ఇది లాస్ట్ ఛాన్స్.. ఇది మిస్సయితే నిన్ను ఎవరూ కాపాడలేరు భయ్యా!

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కెరీర్ ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడింది. కివీస్‌తో జరిగిన సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సంజూకి, సౌతాఫ్రికాతో జరగబోయే వార్మప్ మ్యాచ్ ఇప్పుడు చావోరేవో లాంటిది. ఈ ఒక్క మ్యాచ్‌లో సంజూ మెరిస్తేనే మెయిన్ టీమ్‌లో చోటు దక్కుతుంది, లేదంటే బెంచ్‌కే పరిమితం కాక తప్పదు.

Sanju Samson : సంజూ శాంసన్ కెరీర్ క్లైమాక్స్..ఇది లాస్ట్ ఛాన్స్.. ఇది మిస్సయితే నిన్ను ఎవరూ కాపాడలేరు భయ్యా!
Sanju Samson

Updated on: Feb 03, 2026 | 4:00 PM

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కెరీర్ ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడింది. కివీస్‌తో జరిగిన సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సంజూకి, సౌతాఫ్రికాతో జరగబోయే వార్మప్ మ్యాచ్ ఇప్పుడు చావోరేవో లాంటిది. ఈ ఒక్క మ్యాచ్‌లో సంజూ మెరిస్తేనే మెయిన్ టీమ్‌లో చోటు దక్కుతుంది, లేదంటే బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు సంజూ శాంసన్ ఫామ్ భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సంజూ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 46 పరుగులు మాత్రమే చేసి, 9.2 సగటుతో తన దయనీయ స్థితిని చాటుకున్నాడు. అదే సమయంలో జట్టులోకి వచ్చిన ఈషాన్ కిషన్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 215 పరుగులు బాదేసి, తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇప్పుడు సంజూ గనుక తనను తాను నిరూపించుకోకపోతే ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఉద్వాసన తప్పదు.

బుధవారం నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. విచిత్రం ఏమిటంటే.. ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ దాదాపు 35 వేల టికెట్లు అమ్ముడైపోయాయి. స్టేడియం మొత్తం హౌస్‌ఫుల్ కాబోతోంది. ఇంత భారీ జనం మధ్య సంజూ గనుక మెరుపు ఇన్నింగ్స్ ఆడితే, సెలెక్టర్ల మనసు మళ్లీ మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో సంజూకి అవకాశం దక్కుతుందా? దక్కితే దాన్ని వినియోగించుకుంటాడా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రపంచకప్ ఆరంభంలో భారత్ జట్టు యూఎస్ఏ, నమీబియా వంటి చిన్న జట్లతో తలపడనుంది. ఆ మ్యాచ్‌ల్లో చోటు దక్కాలంటే సౌతాఫ్రికాపై సంజూకి మంచి స్కోరు అవసరం. ఈషాన్ కిషన్ ఫుల్ ఫామ్‌లో ఉండటం వల్ల ఓపెనింగ్‌లో రోహిత్, విరాట్ స్థానాల తర్వాత కిషన్ పేరు వినిపిస్తోంది. సంజూ గనుక మిడిల్ ఆర్డర్‌లో సత్తా చాటకపోతే, టీమ్ కాంబినేషన్ నుంచి అతడిని పక్కన పెట్టడం ఖాయం. ఒకరకంగా చెప్పాలంటే సంజూ శాంసన్‌కు ఇది ఫైనల్ లాంటి పరీక్ష.

సంజూ శాంసన్‌ టాలెంట్ పై ఎవరికీ అనుమానం లేదు, కానీ నిలకడలేమి అతడిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతోంది. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో బాగా ఆడుతున్నప్పటికీ, బ్లూ జెర్సీలో సంజూ ఇంకా తన ముద్ర వేయలేకపోయాడు. మరోవైపు యువ ఆటగాళ్ల పోటీ పెరిగిపోవడంతో సంజూకి ఈ సౌతాఫ్రికా మ్యాచ్ మలుపుగా మారాలి. ఇక్కడ రన్స్ వస్తే సంజూ హీరో, లేదంటే ప్రపంచకప్ ఆశలు గాలిలో దీపంలా మారుతాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి