IPL 2021 Final, CSK vs KKR: ఫైనల్లో చెలరేగిన చెన్నై బ్యాట్స్‌మెన్స్.. కోల్‌కతా ముందు 193 పరుగుల భారీ స్కోర్

|

Oct 15, 2021 | 9:25 PM

CSK vs KKR: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

IPL 2021 Final, CSK vs KKR: ఫైనల్లో చెలరేగిన చెన్నై బ్యాట్స్‌మెన్స్.. కోల్‌కతా ముందు 193 పరుగుల భారీ స్కోర్
Ipl 2021, Csk Vs Kkr
Follow us on

IPL 2021 Final, CSK vs KKR: ఐపీఎల్ 2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించి, టీం భారీ స్కోర్ చేసేందుకు సహాయపడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ (32 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్), ఫాప్ డుప్లెసిస్ 61 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ (626) పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. నేటి మ్యాచులో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్లో సింగిల్‌ తీసి 635 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్‌ రేసులో రుతురాజ్ నిలాచాడు. కీలక సమయంలో రుతురాజ్ భారీ షాట్‌కు ప్రయత్నించి సునీల్ నరైన్ బౌలింగ్‌లో లాంగ్‌ ఆన్‌లో శివం మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప(31 పరుగులు, 15 బంతులు, 3 సిక్స్‌లు)తో కలిసి డుప్లెసిస్(86 పరుగులు, 59 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సులు) భారీ షాట్లు ఆడుతూ, ఈజీగా బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఈ ఇద్దరూ కలిసి మరో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని చెన్నైకి అందించారు. మంచి ఊపులో ఆడుతోన్న రాబిన్ ఊతప్ప 206 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్న టైంలో రివర్స్ షాట్‌కు ప్రయత్నించి నరైన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. రెండు వికెట్లు పడినా ఫైనల్ మ్యాచ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం పరుగులు సాధించడంలో ఏమాత్రం తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(37 పరగులు, 20 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సులు) కూడా సిక్సులతో చెలరేగాడు. అయితే మూడో వికెట్‌కు కూడా చెన్నై బ్యాట్స్‌మెన్స్ మూడో అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో డుప్లెసిస్.. శివం మావీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికట్లు, శివం మావీ ఒక వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు.

ఐపీఎల్‌లో రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై 17, కోల్‌కతా 9 మ్యాచ్‌లు గెలిచాయి. యూఏఈలో జరిగిన 3 మ్యాచ్‌లలో చెన్నై 2, కేకేఆర్ 1 గెలిచింది. ఫైనల్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. చెన్నై గెలిచిన ఈ మైదానంలో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే ముఖాముఖిగా తలపడ్డాయి.

లీగ్ రౌండ్‌లో రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. అయితే కేకేఆర్ రెండు సార్లు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. షేక్ జాయెద్ స్టేడియంలో సెప్టెంబర్ 26 న జరిగిన మ్యాచ్‌లో, చెన్నై రెండు వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి దశలో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్లేయింగ్ ఎలెవన్:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (కీపర్), ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

Also Read: