IPL 2023: తండ్రి గ్యాస్ సిలిండర్ల పంపిణీ.. సోదరులు డైలీ లేబర్స్.. ఐపీఎల్ నయా సెన్సేషన్ లైఫ్‌లో ఎన్నో కష్టాలు..

|

Apr 10, 2023 | 6:35 PM

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ.. ఈ పేర్లు మాత్రమే ఐపీఎల్‌లో ప్రతిధ్వనిస్తుంటుంది. కానీ, తాజాగా మరోపేరు మార్మోగుతోంది. ప్రస్తుతం ఆయనకు ప్రపంచమే సలాం చేస్తోంది. ఆదివారం చివరి బంతికి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్..

1 / 5
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ.. ఈ పేర్లు మాత్రమే ఐపీఎల్‌లో ప్రతిధ్వనిస్తుంటుంది. కానీ, తాజాగా మరోపేరు మార్మోగుతోంది. ప్రస్తుతం ఆయనకు ప్రపంచమే సలాం చేస్తోంది. ఆదివారం చివరి బంతికి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్.. సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. రింకూ సింగ్ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాది గుజరాత్ టైటాన్స్ నుంచి విజయాన్ని లాక్కున్నాడు. ఈ రోజు ప్రపంచం రింకూ సింగ్ విజయానికి సెల్యూట్ చేస్తోంది. అయితే ఈ ఆటగాడు తన వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం..

2 / 5
రింకూ సింగ్ పేదరికంలోనే జీవిస్తున్నాడు. అతని తండ్రి ఇంటింటికీ సిలిండర్లను పంపిణీ చేస్తుంటాడు. రింకూ సింగ్ ఇద్దరు సోదరులు కూడా సాధారణ ఉద్యోగాలు చేస్తుంటారు. ఐపీఎల్‌లో ఆడుతున్న రింకూ సింగ్ కుటుంబం ఆదాయం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
రింకూ సింగ్ తండ్రి ఖాంచంద్ చాలా కాలంగా సిలిండర్లను ఇంటింటికీ డెలివరీ చేస్తున్నారు. అతని తండ్రికి నెలకు వచ్చే ఆదాయం 10 వేల రూపాయలు మాత్రమే. రింకూ తమ్ముడు ముకుల్ కూడా గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. అతని జీతం కూడా నెలకు 10 వేలు. రింకూ సింగ్ పెద్ద సోదరుడు సోను ఇ-రిక్షా నడుపుతాడు. నెలకు 15 నుంచి 20 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. రింకూ సింగ్ కుటుంబం ఇప్పటికీ అలీగఢ్‌లోని 2 గదుల ఇంట్లోనే నివసిస్తోంది.

4 / 5
రింకూ సింగ్ ప్రస్తుత IPL జీతం రూ. 55 లక్షలు. అయితే 2018 నుంచి 2021 వరకు రింకూ సింగ్ జీతం 80 లక్షల రూపాయలుగా ఉండేది. కానీ, 2022 సంవత్సరంలో రింకు సింగ్ ఐపీఎల్ వేలంలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత KKR ఈ బ్యాట్స్‌మన్‌ను రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. అంటే రింకూ సింగ్ గత ఐపీఎల్ జీతం కంటే రూ.25 లక్షలు తక్కువగా పొందుతున్నాడు.

5 / 5
రింకూ సింగ్ ఇప్పటి వరకు 18 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 24.93 సగటుతో 349 పరుగులు సాధించాడు. ఈ బ్యాట్స్‌మన్ స్ట్రైక్ రేట్ దాదాపు 140గా నిలిచింది. గతేడాది నుంచే రింకూ సింగ్ సత్తా చాటుతున్నాడు. 2022లో రింకూ సింగ్ 7 మ్యాచ్‌ల్లో 34.80 సగటుతో 174 పరుగులు చేశాడు. ఈ ఏడాది కూడా ఈ ఆటగాడు రెండు మ్యాచ్‌లు గెలిపించాడు. బెంగళూరుపై కూడా రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి దోహదపడ్డాడు. ఈ సీజన్‌లో రింకూ బ్యాట్‌ నుంచి మరిన్ని పేలుళ్లు చూడొచ్చని అంతా భావిస్తున్నారు.