Triple Century: ఎవర్రా సామీ నువ్వు.. 25 సిక్సర్లు, 23 ఫోర్లు.. ట్రిపుల్ సెంచరీతో 23 ఏళ్ల ఓపెనర్ బీభత్సం..

|

Oct 22, 2024 | 1:22 PM

CK Nayudu Cup Triple Century: ప్రస్తుతం క్రికెట్‌లో సెంచరీలు, డబుల్ సెంచరీలు కామన్ అయ్యాయి. అయితే, దేశవాళీ క్రికెట్‌లో కేవలం 23 ఏళ్ల వయసులో ట్రిపుల్ సెంచరీ చేసి సత్తా చాటిన ఓ ప్లేయర్.. ప్రస్తుతం సంచలనంగా మారాడు. దీంతో దేశాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకున్నాడు.

Triple Century: ఎవర్రా సామీ నువ్వు.. 25 సిక్సర్లు, 23 ఫోర్లు.. ట్రిపుల్ సెంచరీతో 23 ఏళ్ల ఓపెనర్ బీభత్సం..
Macneil Hadley Noronha
Follow us on

CK Nayudu Cup Triple Century: క్రికెట్ ప్రపంచంలో ఎన్నో డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ రికార్డులు కనిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి బ్యాట్స్‌మెన్స్ తమ తుఫాను బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని భయపెడుతున్నారు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో కేవలం 23 ఏళ్ల వయసులో ట్రిపుల్ సెంచరీ చేసి అబ్బురపరిచిన బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నాడు. తుఫాను ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాడు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో సంచలనం సృష్టించిన కర్ణాటక యువ ఓపెనర్ మెక్‌నీల్ నొరోన్హా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతని వికెట్ కోసం బౌలర్లు పడిగాపులు కాశారు.

భారీ స్కోర్ చేసిన కర్ణాటక..

నొరోన్హా బ్యాటింగ్ కారణంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టు పూర్తిగా ఆధిక్యం సాధించింది. ఈ ఓపెనర్ విధ్వంసం తొలి ఇన్నింగ్స్‌లోనే కనిపించింది. ఈ ఆటగాడు బౌలర్లపై విరుచుకపడ్డాడు. భారీషాట్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ కర్ణాటకను మ్యాచ్‌లో చాలా ముందంజలో ఉంచాడు. దీంతో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 580 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బౌలర్లు కూడా రాణించడంతో త్రిపుర జట్టు కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. ఏడుగురు బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించిన శశికుమార్ బౌలింగ్‌లో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో మెక్‌నీల్ నొరోన్హా ట్రిపుల్ సెంచరీ చేయడం విశేషం. ఈ 23 ఏళ్ల బ్యాట్స్‌మన్ తన ఇన్నింగ్స్‌లో 25 సిక్సర్లు కొట్టి 150 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు కూడా ఉన్నాయి. ఈ యువ బ్యాట్స్‌మెన్ 99.14 స్ట్రైక్ రేట్‌తో 348 బంతుల్లో బ్యాటింగ్ చేసి 345 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్‌ను సాధించాడు. 335 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.

టోర్నీలో సత్తా చాటుతోన్న ప్లేయర్లు..

కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో వెలుగులోకి వస్తున్నారు. మరోవైపు, రంజీ ట్రోఫీ గేమ్‌లలో కొంత మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తున్నారు. నొరోన్హా ట్రిపుల్ సెంచరీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి అలాంటి ఫాంనే కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.

మరిన్ని  క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..