KL Rahul: గుడ్‌న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి..

|

Mar 24, 2025 | 9:19 PM

IPL 2025 మొదటి మ్యాచ్ ఆడటానికి ముందే కేఎల్ రాహుల్ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టి ముంబైకి తిరిగి వచ్చాడు. అక్కడ అతని భార్య అతియా శెట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా రాహుల్ తన కూతురు పుట్టిన వార్తను పంచుకున్నాడు.

KL Rahul: గుడ్‌న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి..
Kl Rahul Athiya Shetty
Follow us on

ఐపీఎల్ 2025 ప్రారంభం ఢిల్లీ క్యాపిటల్స్ , టీం ఇండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కు శుభవార్త తెచ్చిపెట్టింది. రాహుల్, అతని భార్య అతియా శెట్టి ఇంట్లోకి కొత్త సభ్యుడు ప్రవేశించాడు. రాహుల్ భార్య అతియా శెట్టి మార్చి 24, సోమవారం నాడు తమ కుమార్తెకు జన్మనిచ్చింది. రాహుల్, అతియా మొదటిసారి తల్లిదండ్రులు అయిన ఆనందాన్ని పొందారు. రాహుల్, అతియా తమ కుమార్తె పుట్టిన శుభవార్తను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, దానికి ఒక రోజు ముందే ఇంటికి తిరిగి వచ్చాడు. తన భార్య అతియా ఎప్పుడైనా బిడ్డకు జన్మనివ్వవచ్చని రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి చెప్పడంతో.. ఈ ప్రత్యేక సందర్భంగా కుటుంబంతో కలిసి ఉండటానికి ఫ్రాంచైజీ రాహుల్‌ను అనుమతించిందంట.

మార్చి 24, సోమవారం, ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతున్నప్పుడు, రాహుల్, అతియా తమ కుమార్తె పుట్టిన వార్తను ఫోటోతో పంచుకున్నారు. అయితే, రాహుల్, అతియా తమ కుమార్తె పేరును ఇంకా వెల్లడించలేదు. అభిమానులతో పాటు, క్రికెట్, సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖ తారలు కూడా ఈ పోస్ట్‌పై వారిద్దరినీ అభినందించారు. కాగా, రాహుల్, అతియా 2023 లో వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల క్రితమే వారు తల్లిదండ్రులు కాబోతున్నారని వెల్లడించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.