Kolkata Knight Riders vs Punjab Kings: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. రస్సెల్ రెచ్చిపోయి ఆడటంతో 33 బంతులు ఉండగానే మ్యాచ్ ముగిసింది. కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయి 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణించాడు. 15 బంతుల్లో 5 ఫోర్లు బాది 26 పరుగులు చేశాడు. సామ్ బిల్లింగ్స్ కూడా సేమ్ టు సేమ్. 23 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అజింక్య రహానె 12 పరుగులు చేశాడు.
కాగా, వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్.. తొలి నుంచే తడపాటుకు గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. పంజాబ్ టీమ్‌లో రాజపక్స మాత్రమే రాణించాడు. 9 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేసి 31 పరుగులు చేశాడు. రబడ 16 బంతుల్లో 25 పరుగులు చేశాడు. లవింగ్‌స్టోన్(19), ధావన్ (16) కొట్టారు.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : మయాంక్ అగర్వాల్ ( కెప్టెన్), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి
A look at the Playing XI for #KKRvPBKS
Live – https://t.co/lO2arKbxgf #KKRvPBKS #TATAIPL pic.twitter.com/FrOuHdROAS
— IndianPremierLeague (@IPL) April 1, 2022
మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన కోల్ కతా రెండో మ్యాచ్లో ఓడింది. దీంతో మరోసారి విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోంది.
మొదటి మ్యాచ్ కు దూరమైన దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ పంజాబ్ జట్టులో చేరునున్నాడు. దీంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠం కానుంది.
Kolkata vs Punjab Match: పంజాబ్ కింగ్స్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 14 ఓవర్లలోనే లక్షిత 137 పరుగులను చేధించి.. విజయదుందుభి మోగించింది.
లక్ష్య చేధనలో కోల్‌రతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ దుమ్ము రేపుతున్నారు. ఆండ్రూ రస్సెల్ హాస్ సెంచరీతో అదరగొట్టాడు. కోల్‌కతా విజయానికి కేవలం 16 పరుగుల దూరంలోనే ఉంది. 36 బంతులు ఉండటం విశేషం.
Kolkata vs Punjab Match: ఏడో ఓవర్ చివరి బంతికి రాహుల్ చాహర్ నితీష్ రాణాను అవుట్ చేశాడు. రాహుల్ వేసిన బంతి రానా ప్యాడ్‌కు తగలగా.. పంజాబ్ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్యాడు.
ఏడో ఓవర్ నాలుగో బంతికి శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు. రాహుల్ చాహర్ వేసిన బంతికి శ్రేయాస్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా.. రబడా క్యాచ్ పట్టాడు. అయ్యర్ 26 పరుగులు చేశాడు.
కోల్‌కతా జట్టు కష్టాల్లో పడింది. నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ (26), సామ్ బిల్లింగ్స్ (0) వెంట వెంటనే ఔటయ్యారు. రాహుల్ చాహర్ ఈ రెండు వికెట్లు తీశాడు.
కోల్ కతా స్కోరు 50 పరుగులు దాటింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి తోడుగా సామ్ బిల్లింగ్స్ (8) తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఆజట్టు స్కోరు 6.4 ఓవర్లలో 51/3.
వెంకటేశ్ అయ్యర్ (3) మరోసారి నిరాశ పర్చాడు. ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్ బార్‌కు క్యాచి ఇచ్చి అయ్యర్ వెనుదిరిగాడు.
దీంతో సామ్ బిల్లింగ్స్ బరిలోకి దిగాడు. ప్రస్తుతం కోల్‌కతా స్కోరు 4.4 ఓవర్లలో 42/2.
బ్యాటింగ్‌లో సత్తా చాటిన కగిసో రబాడ కోల్‌కతాకు మొదటి షాక్ ఇచ్చాడు. మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపుమీదున్న ఓపెనర్ అజింక్యా రహానే (12)ను ఔట్ చేశాడు. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం కోల్‌కతా స్కోరు 2.2 ఓవర్లలో16/1
కోల్‌కతా బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో ఆ జట్టు 18.2 ఓవర్లలో 132 పరుగులకు అలౌటైంది. 31పరుగులు చేసిన భానుపక్సే టాప్ స్కోరర్‌గా నిలవగా కగిసో రబాడా (25), లివింగ్‌స్టోన్ (16) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఉమేశ్ యాదవ్ 4 వికెట్లతో పంజాబ్ పతనాన్ని శాసించగా..టిమ్ సౌథీ రెండు వికెట్లు, శివమ్ మావీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలా ఓ వికెట్ తీశారు.
పంజాబ్ జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రబాడా (16 బంతుల్లో 25) రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మొదటి మ్యాచ్‌కు దూరమైన సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడా బ్యాటింగ్‌లోనూ సత్తాచాటుతున్నాడు. 8వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పంజాబ్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు 15 బంతులు ఎదుర్కొన్న అతను 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 25 పరుగులు చేశాడు. మరోవైపు ఓడియన్ స్మిత్ (9) పరుగులు చేసేందుకు కష్టపడుతున్నాడు.
న పంజాబ్ జట్టును ఆదుకున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 137/8.
పంజాబ్ కింగ్స్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో నితీశ్‌రాణాకు క్యాచ్ ఇచ్చి రాహుల్ చాహర్ (0) ఔటయ్యాడు. క్రీజులోకి కగిసో రబాడా వచ్చాడు. ఇంకా ఇన్నింగ్స్ లో 5 ఓవర్లు మిగిలి ఉన్నాయి.
ఉమేశ్ యాదవ్ విజృంభిస్తున్నాడు. ఇప్పటికే రెండు కీలక వికెట్లు తీసిన అతను హర్‌ప్రీత్ బార్ (14) కూడా పెవిలియన్‌కు పంపించాడు. అతని స్థానంలో రాహుల్ చాహర్ క్రీజులోకి వచ్చాడు.
పంజాబ్ స్కోరు వంద పరుగులు దాటింది. క్రీజులో హర్‌ప్రీత్ బార్ (14), ఓడియన్ స్మిత్ (2) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లు ముగిసే సరికి మయాంక్ సేన స్కోరు 102/6
పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆదుకుంటాడనుకున్న షారుక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌతీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన అతను నితీశ్ రాణా చేతికి చిక్కాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 12.2 ఓవర్లలో 92/6.
Tim Southee picks up his second wicket.
Shahrukh Khan departs for a duck.
Live – https://t.co/lO2arKbxgf #KKRvPBKS #TATAIPL pic.twitter.com/lUUnNjmXT0
— IndianPremierLeague (@IPL) April 1, 2022
పంజాబ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో రాజ్ బవా (11) క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో షారుక్ ఖాన్ (0), హర్‌ప్రీత్ కౌర్ (1) క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 85/5
ఉమేశ్ యాదవ్ మళ్లీ మెరిశాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కెప్టెన్ మయాంక్‌ను ఔట్ చేసి జట్టుకు శుభారంభం అందించిన అతను లివింగ్ స్టోన్ (19)ను పెవిలియన్ పంపించి మరో షాకిచ్చాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 9.2 ఓవర్లలో 84/4
నిలకడగా ఆడుతోన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ( 15 బంతుల్లో 16)ను సౌథీ ఔట్ చేశాడు. దీంతో 62 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది పంజాబ్. అతని స్థానంలో అండర్-19 వరల్డ్ కప్ స్టార్ రాజ్ బవా క్రీజులోకి అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్‌లో అతను డకౌటైన సంగతి తెలిసిందే.
పంజాబ్ స్కోరు 50 పరుగులు దాటింది. శిఖర్ ధావన్ (12), లియామ్ లివింగ్ స్టోన్ (10) క్రీజులో ఉన్నారు. కోల్ కతా బౌలర్లలో ఉమేశ్, శివమ్ మావీ తలా ఓ వికెట్ తీశారు.
ధాటిగా బ్యాటింగ్ చేస్తోన్న భానపక్సే (9 బంతుల్లో 31) ఔటయ్యాడు. శివమ్ మావీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఎక్సట్రా కవర్‌లో సౌథీ చేతికి చిక్కాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 4 ఓవర్లలో 43/2
కెప్టెన్ మయాంక్ స్థానంలో వచ్చిన భానుక రాజపక్సే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫోర్లు, సిక్స్ లతో కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం8 బంతులు ఎదుర్కొన్న అతను 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సహాయంతో 31 పరుగులు చేశాడు.
కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించిన అతను పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లోనూ ఫైర్ మీదున్నాడు. ఫామ్ లో ఉన్న పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తన జట్టుకు శుభారంభం అందించాడు.
కోల్‌కతా జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ శివమ్ మావికి జట్టులో స్థానం కల్పించింది. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సమయంలో శ్రేయస్ చెప్పుకొచ్చాడు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మయాంక్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.