
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సీఈవో కాశీ విశ్వనాథన్.. దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ 2027లో ఆడే అవకాశాలపై స్పందించారు. గాయాల కారణంగా 2026 సీజన్ మొత్తానికి దూరమైన ధోనీ.. వచ్చే సీజన్‌లో సీఎస్కే తరపున తిరిగి బరిలోకి దిగుతాడనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం సీఎస్కే ప్రదర్శనపై ప్రభావం చూపింది. దీంతో చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.
45 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ ఇకపై మరింత కాలం క్రికెట్ ఆడటం అంత సులభం కాదు. అయినప్పటికీ సీఎస్కే ఫ్రాంచైజీ తరపున మరో సీజన్ ఆడాలని ధోనీ నిర్ణయించుకుంటాడని కాశీ విశ్వనాథన్ ఆశిస్తున్నారు.
చెన్నైలో స్థానిక మీడియాతో మాట్లాడిన సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్.. ఐపీఎల్ 2027లో ధోనీ ఆడాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయమేనని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ధోనీ చెన్నైకి వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేస్తాడని చెప్పారు.
“ఈ ప్రశ్నను మీరు ధోనీనే అడగాలి. నేను కూడా అతడినే అడగాలి. ధోనీ చెన్నైకి వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని మాకు తెలియజేస్తాడు. అయితే అతడు సీఎస్కే తరపున కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఆయన ఇప్పటికీ ఆటగాడే కదా” అని కాశీ విశ్వనాథన్ అన్నారు.
ఎక్కువమంది చదివినది: 6,W,6,W,6,W,6,W,6,W.. సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
2026 ఐపీఎల్ సీజన్ మొత్తం ధోనీ సీఎస్కే జట్టుతోనే ప్రయాణించాడు. అయితే వరుస గాయాల కారణంగా ఒక్క మ్యాచ్‌లో కూడా మైదానంలోకి దిగలేకపోయాడు. డగౌట్‌లో కూర్చుని తన అనుభవంతో జట్టుకు సలహాలు ఇచ్చినప్పటికీ, మైదానంలో ధోనీ లేకపోవడం సీఎస్కే ప్రదర్శనపై ప్రభావం చూపింది.
ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం ఫ్రాంచైజీ ఒక మార్పుల దశలో ఉంది. ఇలాంటి సమయంలో అత్యంత అనుభవజ్ఞుడైన ధోనీ సేవలు జట్టుకు ఉపయోగపడతాయని సీఎస్కే భావిస్తోంది.
చాలాకాలంగా సీఎస్కే ప్రధాన కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) ఇటీవలే ఫ్రాంచైజీతో తన ప్రయాణాన్ని ముగించాడు. అతడి స్థానంలో జహీర్ ఖాన్ (Zaheer Khan) బాధ్యతలు చేపట్టాడు. కొత్త కోచ్ తన వ్యూహాలను జట్టులో అమలు చేయడానికి కొంత సమయం అవసరం. ఈ సమయంలో ధోనీ వంటి అనుభవజ్ఞుడు జట్టుతో ఉంటే కొత్త కోచ్‌కు కూడా సహాయపడే అవకాశం ఉంది.
ఎక్కువమంది చదివినది: బ్రేకప్‌కు బ్రేక్.. మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. అసలు ఏం జరిగిందంటే?
మరోవైపు ధోనీ గైర్హాజరీలో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కూడా కెప్టెన్సీలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మహారాష్ట్రకు చెందిన రుతురాజ్‌కు మరింత మార్గనిర్దేశం చేయాలని సీఎస్కే భావిస్తోంది. అందుకే ధోనీ మరో సీజన్ ఆడితే.. రుతురాజ్‌ను మరింత తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించగలడనే ఆశాభావం సీఎస్కేలో ఉంది. అయితే IPL 2027లో తన భవిష్యత్తుపై తుది నిర్ణయం మాత్రం పూర్తిగా ఎంఎస్ ధోనీదే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..