Karun Nair: అది నిజం కాదు.. ఆ వైరల్ ఫొటోపై కరుణ్ నాయర్ ఏమన్నారంటే..?

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో కరుణ్ నాయర్ ప్రదర్శన నిరాశపరిచింది. కానీ ఓవల్ మ్యాచ్‌లో అతని అర్ధ సెంచరీ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పర్యటనలో కరుణ్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎట్టకేలకు దానిపై కరుణ్ నాయర్ స్పందించారు.

Karun Nair: అది నిజం కాదు.. ఆ వైరల్ ఫొటోపై కరుణ్ నాయర్ ఏమన్నారంటే..?
Karun Nair Reacts On Viral Photo

Updated on: Aug 14, 2025 | 1:13 PM

ఇటీవల ముగిసిన భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసినప్పటికీ.. ఈ సిరీస్ కరుణ్‌కు కలగానే మిగిలిపోయింది. సరిగ్గా 8 ఏళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్, ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తప్ప పెద్దగా ఆకట్టుకోలేడు. దీంతో కరుణ్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే వాదనలు వినిపించాయి. వీటన్నిటి మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటో కరుణ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు పుకార్లకు దారితీసింది.

నిజానికి ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌ను భారత జట్టు 6 పరుగుల తేడాతో గెలుచుకోవడం ద్వారా సిరీస్‌ను సమం చేసింది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఆడే అవకాశం పొందిన కరుణ్ నాయర్, మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి జట్టును ఇబ్బందుల నుండి కాపాడాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో కరుణ్ నిరాశపరిచాడు. అంతకుముందు జరిగిన నాలుగో టెస్టులో కరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌ బయట కూర్చుని ఏడస్తుండుగా  కేఎల్ రాహుల్‌ అతడిని ఓదార్చుతున్న ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  దీనిపై అప్పుడు అతడు స్పందిచలేదు.

ఫోటోపై నాయర్ ఏమన్నారు?

ఈ ఫొటోపై కరుణ్ నాయర్ ఎట్టకేలకు స్పందించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్‌తో నేను తాన్న ఫోటో ఏఐ ద్వారా సృష్టించారని అన్నారు. తాను అక్కడ కూర్చున్నది నిజమే అని.. కానీ ఆ ఫొటో మాత్రం నిజం కాదన్నారు. అంతేకాకుండా కేఎల్ రాహుల్‌తో తనకున్న అనుబంధం గురించి కరుణ్ కీలక కామెంట్స్ చేశాడు. ప్రసిద్ధ్, కేఎల్ రాహుల్‌తో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. వారిద్దరితో కలిసి హ్యాపీ టైమ్ గడిపినట్లు తెలిపారు. క్రికెట్‌తో పాటు ఎన్నో విషయాలపై చర్చించుకున్నట్లు చెప్పారు. సిరీస్ సమం అయినందుకు సంతోషంగా ఉందని వివరించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..