Video: విజయానికి 11 పరుగులు.. తొలి బంతికే 8 పరుగులు.. కట్‌చేస్తే.. టైగా ముగిసిన మ్యాచ్.. ఎక్కడో తెలుసా?

Southern Brave vs Birmingham Phoenix: మొదటి బంతికి 8 పరుగులు వస్తే.. 11 పరుగులను కాపాడుకోవడం చాలా కష్టం. ది హండ్రెడ్ లీగ్ ఆఫ్ ఇంగ్లండ్‌లో అకిల్ హుస్సేన్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. లీగ్ ఎలిమినేటర్ సదరన్ బ్రేవ్ వర్సెస్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 6 వికెట్లకు 126 పరుగులు చేసింది.

Video: విజయానికి 11 పరుగులు.. తొలి బంతికే 8 పరుగులు.. కట్‌చేస్తే.. టైగా ముగిసిన మ్యాచ్.. ఎక్కడో తెలుసా?
Southern Brave Vs Birmingham Phoenix

Updated on: Aug 18, 2024 | 7:27 PM

Southern Brave vs Birmingham Phoenix: మొదటి బంతికి 8 పరుగులు వస్తే.. 11 పరుగులను కాపాడుకోవడం చాలా కష్టం. ది హండ్రెడ్ లీగ్ ఆఫ్ ఇంగ్లండ్‌లో అకిల్ హుస్సేన్ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. లీగ్ ఎలిమినేటర్ సదరన్ బ్రేవ్ వర్సెస్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 6 వికెట్లకు 126 పరుగులు చేసింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కూడా 7 వికెట్లు కోల్పోయి 100 బంతుల్లో 126 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అయితే, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌కు ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకునే సువర్ణావకాశం లభించినా, 4 బంతుల్లో 3 పరుగులు చేయలేకపోవడంతో కోల్పోయింది.

11 పరుగులు కావాలి.. మొదటి బంతికి 8 పరుగులు వచ్చినా.. మ్యాచ్ టై అయింది..

సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ చివరి 5 బంతుల్లో 11 పరుగుల చేయాల్సి వచ్చింది. అకిల్ హుస్సేన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతని మొదటి బంతి నో బాల్, దానిపై లివింగ్స్టన్ సిక్స్ కొట్టాడు. అంటే 7 పరుగులు అలానే వచ్చాయి. ఆ తర్వాత, అకిల్ బౌలింగ్‌లో లీగల్ డెలివరీ చేయగా, అతను దానిపై మరో పరుగు అందుకున్నాడు. ఈ విధంగా తొలి బంతికే 8 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ గెలవాలంటే తర్వాతి 4 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది. కానీ, లివింగ్‌స్టన్ వికెట్ తీయడమే కాకుండా, అకిల్ ఆ 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో స్కోరు సమంగా ఉండడంతో మ్యాచ్‌ టై అయింది.

సూపర్-5లో జోఫ్రా ఆర్చర్ అద్భుతం..

మ్యాచ్ టై అయిన తర్వాత విషయం సూపర్-5కి చేరింది. అవును, ది హండ్రెడ్‌లో సూపర్ ఓవర్ కాదు సూపర్-5 ఉంది. ఇరుజట్లు తలో 5 బంతులు ఆడాలన్నమాట. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. జోఫ్రా ఆర్చర్ సదరన్ బ్రేవ్‌కు బౌలింగ్ చేయడానికి వచ్చాడు. స్ట్రయిక్‌లో ఉన్న లివింగ్‌స్టన్‌ను ఆర్చర్ తొలి బంతికే అవుట్ చేశాడు. ఆ తర్వాత, అతను తదుపరి 3 బంతుల్లో ఒక ఫోర్‌తో 6 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్చర్ వేసిన 5వ బంతి వైడ్ అయింది. కానీ, జాకబ్ బెతెల్ సింగిల్ తీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. సూపర్-5లో మొదట ఆడిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది.

ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు..

బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌తో జరిగిన సూపర్-5లో సదరన్ బ్రేవ్ తొలి 4 బంతుల్లోనే 8 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఈ విజయంతో సదరన్ బ్రేవ్ ఫైనల్స్‌కు టికెట్ బుక్ చేసుకుంది. ఇప్పుడు సదరన్ బ్రేవ్ పురుషుల ది హండ్రెడ్ ఫైనల్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్‌తో తలపడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us