Jasprit Bumrah : వికెట్లపైకి బంతిని విసిరి స్టంప్స్ పడగొట్టాడు.. ఢిల్లీ టెస్ట్‌లో బుమ్రాకు ఎందుకంత కోపం వచ్చింది?

ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు, అక్టోబర్ 13న, వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో బలంగా ఆడుతోంది. జాన్ క్యాంప్‌బెల్, షై హోప్ సెంచరీల సహాయంతో విండీస్ టీమిండియా ఆధిక్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టి, బలమైన స్థితిలో కనిపించింది. ఒకానొక దశలో కుల్‌దీప్ యాదవ్ సహా భారత బౌలర్లు పుంజుకుని 311 పరుగుల వద్ద విండీస్ 9 వికెట్లు కూల్చారు.

Jasprit Bumrah : వికెట్లపైకి బంతిని విసిరి స్టంప్స్ పడగొట్టాడు.. ఢిల్లీ టెస్ట్‌లో బుమ్రాకు ఎందుకంత కోపం వచ్చింది?
Jasprit Bumrah's Frustration Boils

Updated on: Oct 14, 2025 | 6:58 AM

Jasprit Bumrah : మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన వెస్టిండీస్ జట్టు, రెండవ టెస్ట్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయిన విండీస్ ఫాలోఆన్ ఆడక తప్పలేదు. అయితే, రెండవ ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. 270 పరుగుల భారత ఆధిక్యాన్ని ఛేదించడమే కాకుండా, 350 పరుగులకు పైగా చేసి భారత బౌలర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఈ పోరాటంతో తీవ్ర నిరాశకు గురైన టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఏకంగా వికెట్లపైకి బంతిని విసిరి తన ఆగ్రహాన్ని చూపించాడు.

ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు, అక్టోబర్ 13న వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో బలంగా ఆడుతోంది. జాన్ క్యాంప్‌బెల్, షై హోప్ సెంచరీల సహాయంతో విండీస్ టీమిండియా ఆధిక్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టి, బలమైన స్థితిలో కనిపించింది. ఒకానొక దశలో కుల్‌దీప్ యాదవ్ సహా భారత బౌలర్లు పుంజుకుని 311 పరుగుల వద్ద విండీస్ 9 వికెట్లు కూల్చారు. దీంతో రెండవ సెషన్‌లోపే ఇన్నింగ్స్ ముగుస్తుందని అంతా భావించారు.

అయితే, అక్కడే భారత బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఏడో స్థానం బ్యాట్స్‌మెన్ జస్టిన్ గ్రీవ్స్, 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ క్రీజులో పాతుకుపోయారు. ఆఖరి వికెట్ కోసం ఈ ఇద్దరూ పోరాడటంతో భారత జట్టులో ఒత్తిడి పెరిగింది. సరిగ్గా 103వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్ వరుసగా రెండు స్ట్రైట్ డ్రైవ్‌లు ఆడాడు. మొదటి బంతికి ఫోర్ రాగా, రెండో బంతికి 2 పరుగులు వచ్చాయి. విండీస్ బ్యాట్స్‌మెన్ 2 పరుగులు పూర్తి చేయగానే, బంతిని అందుకున్న బుమ్రా తీవ్ర కోపంతో దాన్ని వికెట్లపైకి విసిరి స్టంప్‌లను పడగొట్టాడు. ఈ సమయంలో బ్యాట్స్‌మెన్ క్రీజులోనే ఉన్నారు.

బుమ్రా చర్య చూస్తేనే అర్థమవుతోంది, ఈ సుదీర్ఘమైన చివరి వికెట్ భాగస్వామ్యం భారత జట్టుపై ఎంత ఒత్తిడి పెంచుతోందో. ఫాలోఆన్ తర్వాత మ్యాచ్ ఇంత దూరం సాగడం భారత్ ఊహించలేదు. ఆఖరి వికెట్ తీయడానికి వీలుగా అంపైర్లు టీ-బ్రేక్‌ను అరగంట పాటు పొడిగించారు. అయినప్పటికీ గ్రీవ్స్, సీల్స్ ఆయుధాలు కింద పెట్టలేదు. ఇద్దరూ కలిసి దాదాపు అరగంట పాటు ఆడి ఇన్నింగ్స్‌ను చివరి సెషన్‌ వరకు తీసుకెళ్లారు. అంతేకాకుండా, వికెట్‌ను కాపాడుకుంటూనే దూకుడు షాట్లు ఆడి విండీస్ స్కోరును 350 మార్కు దాటించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..