Jasprit Bumrah Wishes: ‘ప్రియమైన శ్రీమతి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. బుమ్రా లవ్లీ పోస్ట్‌ వైరల్‌.!

|

May 06, 2021 | 4:58 PM

Bumrah And Sanjana Ganesan: టీమిండియా పేసర్ బుమ్రా తన భార్యకు పుట్టినరోజు విషెస్ చెబుతూ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

Jasprit Bumrah Wishes: ప్రియమైన శ్రీమతికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. బుమ్రా లవ్లీ  పోస్ట్‌ వైరల్‌.!
Follow us on

Bumrah And Sanjana Ganesan: టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా తన భార్య సంజన గణేశన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లవ్లీ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది.

‘‘ప్రతి రోజు నా మనసు దోచుకునే నా ప్రాణమా…నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు…ఐ లవ్‌ యూ’’ అంటూ బుమ్రా 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంజనా గణేశన్‌కు లవ్లీ విషెస్‌ తెలిపాడు.

బుమ్రా ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ లవింగ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఐపీఎల్‌ 2021 రద్దు కావడంతో ఈ ప్రేమ పక్షులకు కలిసి వచ్చిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బుమ్రా ఇన్‌స్టాలో షేర్‌ చేసిన లవింగ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఐపీఎల్‌ 2021 రద్దు కావడంతో ఈ ప్రేమ పక్షులకు కలిసి వచ్చిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, బుమ్రా, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజన గణేశన్‌‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం మార్చి 14న గోవాలో జరిగింది.