Bumrah Marriage News: బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆమేనట.? నెట్టింట మరో పుకారు.!! అసలు నిజమేది.!

Jasprit Bumrah Marriage: ఎప్పుడైతే ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టుకు టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా దూరమయ్యాడో.. అప్పటినుంచి...

Bumrah Marriage News: బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆమేనట.? నెట్టింట మరో పుకారు.!! అసలు నిజమేది.!

Updated on: Mar 06, 2021 | 7:28 PM

Jasprit Bumrah Marriage: ఎప్పుడైతే ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టుకు టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా దూరమయ్యాడో.. అప్పటినుంచి సోషల్ మీడియాలో అతడే హాట్ టాపిక్. సోషల్ మీడియాలో బుమ్రాపై రోజుకో వార్త గుప్పుమంటోంది.

త్వరలోనే బుమ్రా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని.. అందువల్లే సెలవు తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనితో బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరన్న దానిపై నెటిజన్లు అప్పుడే గూగుల్‌లో సెర్చింగ్ మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే బుమ్రా, అనుపమలపై పలు గాసిప్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా స్వస్థలం గుజరాత్ కావడం, అనుపమ కూడా ఇటీవల రాజ్‌కోట్ సందర్శించడం.. గతంలో బుమ్రా తన ఫేవరెట్ అని అనడంతో ఈ పుకార్లు షికారు చేశాయి.

ఇక ఇప్పుడు తాజాగా బుమ్రా పెళ్లి చేసుకోబోయేది ఈమెనేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లాడనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7తో కెరీర్ ప్రారంభించిన సంజనా.. ఐపీఎల్‌ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవరించిన సంగతి విదితమే. చూడాలి మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read:

Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!

అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!