
Jasprit Bumrah : భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సాధారణంగా మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడనే పేరుంది. కానీ ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆయన చేసిన ఒక వ్యాఖ్య పెద్ద దుమారం రేపింది. డీఆర్‌ఎస్ అప్పీల్ సమయంలో బుమ్రా సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాను ఉద్దేశించి పొట్టివాడు(బౌనా) అనే పదాన్ని వాడారు. బుమ్రా, పంత్‌తో మాట్లాడిన ఈ మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వ్యాఖ్యపై తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి, సౌతాఫ్రికా ఓపెనర్లను అవుట్ చేశాడు. మార్క్రమ్ వికెట్ పడిన కొద్దిసేపటికే, టెంబా బావుమాపై ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో, డీఆర్‌ఎస్ తీసుకోవాలా వద్దా అని బుమ్రా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తో చర్చించాడు. ఈ చర్చ సమయంలోనే బుమ్రా వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ మధ్య జరిగిన ఈ సంభాషణ స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించి, వైరల్ అయింది. బుమ్రా… బావుమాను ఉద్దేశించి పొట్టివాడు కూడా కదా ఇతను ( Bauna bhi toh hai ye) అని అన్నాడు. డీఆర్‌ఎస్ తీసుకోవడానికి ఇది ఒక కారణం అని బుమ్రా భావించాడు. దానికి పంత్ పొట్టివాడే కానీ, ఇక్కడి నుంచి బంతి లెగ్ స్టంప్‌ను మిస్సవుతుంది అని సమాధానమిచ్చాడు. రిప్లేలో చూస్తే పంత్ చెప్పినట్లుగానే బంతి స్టంప్‌కు తగలకుండా పైనుంచి వెళ్లింది.
Bumrah: Bauna bhi toh hai ye.
Jasprit Bumrah mocking South African captain Temba Bavuma’s height.
Bumrah has become very arrogant these days. 🙂#bumrah pic.twitter.com/7FvOTR9RIe— sharabha (@Egoista_Wand) November 14, 2025
బుమ్రా చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైనా, ఆ తర్వాత బావుమా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అతను కేవలం 3 పరుగులకే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, బుమ్రా చేసిన ఈ వ్యాఖ్యపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, “బుమ్రా ఇప్పుడు చాలా గర్వంగా తయారయ్యాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు బుమ్రాకు శిక్ష వేయాలి” అంటూ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..